ఓ వ్యక్తి దొంగను చంపేశాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 15 సంవత్సరాలపాటు.. శవాన్ని దాచిపెట్టాడు. శవం నుంచి వాసనైనా వస్తుంది కదా అనే అనుమానం మీకు కలిగుండొచ్చు. అయితే.. ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు.. వాసన బయటకు రాకుండా ఉండేందుకు... దాదాపు 70 ఎయిర్ ఫ్రెషనర్లు వాడాడు. అయినప్పటికీ.. అతను చేసిన నేరం బయట పడింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సిడ్నీకి చెందిన షేన్ స్నెల్ మన్  అనే దొంగ.. 2002లో ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. అతనిని అడ్డుకునేందుకు యజమాని బ్రూస్ రాబర్ట్ సదరు దొంగను కాల్చి చంపేశాడు. ఈ నేరం తనపై పడితే ఇబ్బంది పడతానని భయపడి.. ఇంట్లోనే ఓ చోట శవాన్ని పూడ్చి పెట్టేశాడు. అనంతరం వాసన రాకుండా ఉండేందుకు శవం దగ్గర 70 ఎయిర్ ఫ్రెషనర్లు పెట్టాడు.

అయితే.. ఈ విషయం బయటకు రాలేదు. కాగా.. 2017లొ రాబర్ట్ ఆరోగ్య కారణాల రీత్యా ప్రాణాలు కోల్పోయాడు. అతను చనిపోయిన దాదాపు ఓ సంవత్సరం తర్వాత.. అతను ఉంటున్న ఎస్టేట్ క్లియర్ చేయడానికి క్లీనర్లు వచ్చారు. ఆ సమయంలో.. వారికి ఓ మనిషి అవశేషాలు కనిపించడం గమనార్హం. అక్కడ ఎయిర్ ఫ్రెషనర్లు కూడా కనిపించాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.