పారిస్: ఈగను చంపే ప్రయత్నంలో ఓ వ్యక్తి తన ఇల్లును తగులబెట్టాడు. ఈ ఘటన ఫ్రాన్స్ లో చోటు చేసుకొంది. టాలీవుడ్ లో రాజమౌళి సినిమాలో తనను చంపిన విలన్ ను ఈగ రూపంలో ఉన్న హీరో చంపుతాడు. ఈగగా మారినా కూడ విలన్ ను అంతమొందిస్తాడు. ఈగను చంపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి తన ఇంటినే తగులబెట్టుకొన్నాడు.

ఫ్రాన్స్ లోని పార్కుల్ చెనాడ్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్దుడు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నాడు. అయితే ఇంతలో ఓ ఈగ వచ్చింది. దీంతో ఈగపై కోపంతో దాన్ని చంపేందుకు ఎలక్ట్రిక్ రాకెట్ ను ప్రయోగించాడు.

అయితే అప్పటికే ఆ ఇంట్లో గ్యాస్ లీకౌతోంది.ఈ విషయాన్ని ఆయన గుర్తించలేదు.  ఎలక్ట్రిక్ రాకెట్ ను ఈగపై ప్రయోగిస్తే అది తప్పించుకొంది. గ్యాస్ లీకైన కారణంగా ఎలక్ట్రిక్ రాకెట్ ప్రయోగంతో వంట గదిలో పేలుడు చోటు చేసుకొంది. దీంతో ఇంటి పైకప్పు దెబ్బతింది.

2018లో కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి సాలెపురుగులను కాల్చేందుకు ప్రయత్నించిన సమయంలో ఇంటికి నిప్పంటుకొంది.  అదే ఏడాదిలో బొద్దింకలను చంపే ప్రయత్నంలో అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తిని తన ఇంటిని తగులబెట్టుకొన్నాడు.