ఒక వ్యక్తి మూడు ఇంచుల ఎత్తు పెరగడానికి 1.2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. అమెరికాలోని ఓ వైద్యుడు లెగ్ లెంథెనింగ్ సర్జరీ చేసి ఆయనను మూడు ఇంచుల పొడవు పెంచాడు. ఇందుకోసం ఆ పేషెంట్ తొడ ఎముకను విరగ్గొట్టి అడ్జస్టబుల్ మెటల్ నెయిల్‌ను ఇన్సర్ట్ చేశారు. మ్యాగ్నెటిక్ రిమోట్ కంట్రోల్‌తో ఈ నెయిల్‌ను క్రమంగా ఎక్స్‌టెండ్ చేస్తూ వచ్చారు.
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి మూడు ఇంచుల ఎత్తు పెరగడానికి భారీగానే చెల్లించుకున్నాడు. రూ. 1.2 కోట్లు చెల్లించి కాళ్లు పొడుగు చేసుకునే లెగ్ లెంథెనింగ్ సర్జరీ చేయించుకున్నట్టు డైలీ స్టార్ రిపోర్ట్ చేసింది. తాను ఐదు అడుగుల ఆరు అంగుళాల పొడుగుతో విసిగిపోయానని సర్జరీ చేసుకున్న రాయ్ కాన్ తెలిపాడు. తాను మరో మూడు అంగుళాలు పెరగాలని బలంగా కోరుకునేవాడని వివరించాడు. చాన్నాళ్లుగా ఆ కోరిక తీరకుండానే కొనసాగుతూ వచ్చిందని తెలిపాడు. అందుకోసమే.. కేవలం తనకోసమే ఈ సర్జరీ చేయించుకున్నట్టు చెప్పాడు.
ఈ సర్జరీ చేసుకున్న 68 ఏళ్ల రాయ్ కాన్ తన ఎత్తును ఇప్పుడు ఐదు అడుగుల తొమ్మిది ఇంచులకు పెంచుకున్నాడు. ఈ సర్జరీని కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ కెవిన్ దేబీపర్షద్ చేశారు. లాస్ వేగాస్‌లో క్లినిక్ నడిపే ఆయన క్లైంట్లు ఎక్కువగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా కంపెనీల వర్కర్లు ఉంటారని తెలిపారు. ఈ సర్జరీలో తొడ ఎముకను విరగొట్టి అతికించాల్సి ఉంటుందని డాక్టర్ వివరించారు.
Also Read: తొలిసారి విమానప్రయాణం చేసిన.. ప్రపంచ ఎత్తైన మహిళ.. దాని గురించి ఏమన్నారంటే..
ఈ సర్జరీ గురించి రాయ్ కాన్ మాట్లాడతూ, ఎత్తు అనేది పెద్ద ఇష్యూ కాదని అన్నాడు. కానీ, చిన్నప్పటి నుంచి తాను తక్కువ పొడుగు ఉంటా అనే ఆలోచనలతోనే పెరిగానని వివరించాడు. అయితే, ఎత్తు పెంచుకునే సామర్థ్యం నా దగ్గర ఉన్నందున ఈ సర్జరీ ఇప్పుడు చేయించుకున్నట్టు తెలిపాడు. నిజానికి ఎత్తుకు సంబంధించి పెద్ద కాంప్లెక్స్ ఏదీ తనకు లేదని వివరించాడు. అసలు ఎత్తు పెరగడం తన భార్యకు కూడా ఇష్టం లేదని చెప్పాడు.
ఈ ఆపరేషన్ గురించి మాట్లాడుతూ, ఈ సర్జరీ స్వల్ప సమయంలోనే అయిపోతుందని, కానీ, రికవరీ ప్రాసెస్ పెద్దగా ఉంటుందని అన్నాడు. ఇది కొన్ని నెలలు పడుతుందని చెప్పాడు. ఒక ఇంచు ఎత్తు పెరగడానికి 25 రోజులు పడుతుందని, మిగతా ఇంచుల కోసమే రెండున్నర నెలలు పట్టిందని తెలిపాడు.
ఈ సర్జరీకి క్లయింట్ల డిమాండ్ చేస్తున్న ఎత్తు (మూడు ఇంచులు, 6 ఇంచుల వరకు)ను బేస్ చేసుకుని 70 వేల డాలర్ల నుంచి 1,50,000 డాలర్ల వరకు తీసుకుంటామని డాక్టర్ కెవిన్ దేబీపర్షద్ తెలిపాడు. ఎత్తు పెంచడానికి పేషెంట్ తొడ ఎమును విరగొడతామని, అందులో అడ్జస్టబుల్ మెటల్ నెయిల్ బిగిస్తామని పేర్కొన్నాడు. ఆ నెయిల్స్ మూడు నెలలపాటు ప్రతి రోజూ కొంత పెరుగుతుందని చెప్పాడు. మ్యాగ్నెటిక్ రిమోట్ కంట్రోల్ సహాయంతో మూడు నెలల్లో ఈ నెయిల్‌ను ఎక్స్‌టెండ్ చేయాల్సి ఉంటుందని వివరించాడు.
