మాల్దీవులు: ఇండియాలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో  మాల్దీవుల్లో ఎంట్రీకి ఆ దేశం నిషేధం విధించింది.  ఇండియాతో పాటు దక్షిణాసియా దేశాల నుండి వచ్చే పర్యాటకులపై నిషేధం విధించినట్టుగా ఆ దేశం ప్రకటించింది.ఈ నెల 13 నుండి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఈ విషయమై ఆ దేశానికి చెందిన ఇమ్మిగ్రేషన్ విభాగం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

 ఈ నిషేధం ఉన్న నేపథ్యంలో మాల్దీవుల్లో ఉన్న ఇండియన్స్ వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని  ఇండియా కోరింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని భారత రాయబార కార్యాలయానికి సూచించారు అధికారులు.  సీనీ తారలు, వ్యాపారులు పెద్ద ఎత్తున మాల్దీవుల్లో పర్యటిస్తుంటారు. కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ రావడంతో హిందీ సినిమా నలుటు ఇటీవల మాల్దీవుల్లో గడిపి వచ్చారు. 

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.  రోజూ మూడు లక్షలకు పైగా కేసులు రికార్డు అవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు  చాలా రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్ లు, సంపూర్ణ లాక్‌డౌన్ ,నైట్ కర్ఫ్యూలు విధించిన విషయం తెలిసిందే.