Asianet News TeluguAsianet News Telugu

నువ్వు ఇంటికి రా.. నిన్ను చంపేస్తాం: మలాలకు తాలిబన్ల హెచ్చరిక

బాలల హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్ ‌జాయ్‌ను తాలిబన్లు  మరోసారి టార్గెట్ చేశారు. ఆమెను ఈ సారి ఖచ్చితంగా చంపేస్తామంటూ మలాలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

Malala Yousafzais Shooter Threatens Her on Twitter after Fleeing Prison ksp
Author
Islamabad, First Published Feb 18, 2021, 3:01 PM IST

బాలల హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్ ‌జాయ్‌ను తాలిబన్లు  మరోసారి టార్గెట్ చేశారు. ఆమెను ఈ సారి ఖచ్చితంగా చంపేస్తామంటూ మలాలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

తొమ్మిదేళ్ల క్రితం 15 ఏళ్ల వయసులోనే బాలికల విద్య కోసం పోరాడిన మలాల మీద 2012లో పాకిస్తాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు హత్యాయత్నం చేశారు. నాడు చోటు చేసుకున్న కాల్పుల్లో మూడు బుల్లెట్లు మలాల శరీరంలోకి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో పోరాడి గెలిచారు. 

నీతో, మీ నాన్నతో సెటిల్‌ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయని.. నువ్వు వెంటనే ఇంటికి తిరిగి రావాలంటూ పాకిస్తాన్ తాలిబాన్ సభ్యుడు ఎహ్సాన్ ట్వీట్ చేశాడు. ఈసారి నువ్వు ఏ విధంగానూ తప్పించుకోలేవు,  చంపేస్తామని వెల్లడించాడు.

ఈ బెదిరింపులపై మలాల స్పందిస్తూ.. ఇతను తనతోపాటు చాలా మంది అమాయక ప్రజలపై దాడి చేసిన తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ మాజీ ప్రతినిధి అని చెప్పింది. అతను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలను బెదిరిస్తున్నాడని.. ఇంతకీ ఎహ్సాన్ ఎలా తప్పించుకున్నాడని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను‌, సైన్యాన్ని ప్రశ్నించింది.

కాగా ఎహ్సాన్‌ను 2017లో సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే 2020 జనవరిలో అతన్ని పట్టుకున్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి తప్పించుకున్నాడు. అంతేగాక అతని అరెస్టు, తప్పించుకోవడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి.

ఎహ్సాన్‌ తప్పించుకున్న అనంతరం ఇదే ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా పాకిస్తాన్‌ జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎహ్సాన్ లైమ్ లైట్‌లోనే వున్నాడు. అయితే ఈ అకౌంట్లపై ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించింది.

ఇక మలాలకు వచ్చిన హెచ్చరికలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని ప్రధాని సలహాదారు రౌఫ్ హసన్ తెలిపారు. కాగా అనేక సంవత్సరాలు సైనిక కస్టడీలో ఉన్న ఎహ్సాన్‌ వారి నుంచి ఎలా తప్పించుకున్నాడో, అక్కడి నుంచి టర్కీకి ఎలా వెళ్లాడో కూడా అధికారులు వెల్లడించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios