స్నేక్‌వైన్ చేసుకుందామని పాముకి ఆర్డర్.. పాముకాటుకి యువతి బలి

Making snake Wine.. Woman Bitten By Snake
Highlights

స్నేక్‌వైన్ తయారు చేసుకుందామని ఓ యువతి ఆన్‌లైన్‌లో ఓ విషసర్పానికి ఆర్డర్ చేసి.. వైన్‌ తయారు చేసే క్రమంలో అదే పాము కాటుకి గురై ప్రాణాలు కోల్పోయింది

చైనీయుల ఆహార అలవాట్లు విచిత్రంగా ఉంటాయి. పాము పేరు చెబితేనే మనం ఆమడ దూరం పరుగులు తీస్తాము.. అలాంటిది చైనీయులు మాత్రం పాముతో రకరకాల వంటలు చేస్తారు.. ఈ క్రమంలో ఆ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్నేక్‌వైన్‌ను తయారు చేసుకుని ఇష్టంగా సేవిస్తారు. అలా స్నేక్‌వైన్ తయారు చేసుకుందామని ఓ యువతి ఆన్‌లైన్‌లో ఓ విషసర్పానికి ఆర్డర్ చేసి.. వైన్‌ తయారు చేసే క్రమంలో అదే పాము కాటుకి గురై ప్రాణాలు కోల్పోయింది.

షాంగ్జీ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతికి స్నేక్ వైన్ తాగాలనిపించింది వెంటనే ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ఓ విష సర్పాన్ని ఆర్డర్ చేసింది. డెలీవరి తీసుకుని వైన్ ఉన్న పాత్రలో వేసింది. అయితే అది ఎలాగో పాత్ర నుంచి తప్పించుకుని బుసలు కొడుతూ యువతిని కాటు వేసింది. ఆమె నురగలు కక్కుతూ అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి సమీపంలోనే పామును పట్టుకుని తీసుకెళ్లారు.

అయితే చైనా నిబంధనల ప్రకారం విష సర్పాలు, క్రూర జంతువులను విక్రయించడం నేరం. అయినప్పటికీ చిన్నా చితకా ఈ కామర్స్ వెబ్‌సైట్లు డబ్బు సంపాదన కోసం ఇలాంటి అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారని పోలీసులు తెలిపారు. 

loader