Asianet News TeluguAsianet News Telugu

గాంధీజీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్ కు 7యేళ్ల జైలు శిక్ష !

భారత జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమరాలు ఆశిష్ లతా రాంగోబిన్ దక్షిణాఫ్రికాలో మోసం, ఫోర్జరీ కేసులో దోషిగా తేలారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే...

Mahatma Gandhi's great granddaughter jailed for 7 years in South Africa for Rs 3.3 crore fraud - bsb
Author
Hyderabad, First Published Jun 8, 2021, 11:25 AM IST

భారత జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమరాలు ఆశిష్ లతా రాంగోబిన్ దక్షిణాఫ్రికాలో మోసం, ఫోర్జరీ కేసులో దోషిగా తేలారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే...

గాంధీజీ మనవరాలు,  దక్షిణాఫ్రికా లోని ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె లతా రాంగోబిన్...అహింస పై ఏర్పాటైన కో ఎన్జీవో లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.  కాగా 2015 లో భారత్ నుంచి లినెన్ వస్త్రాలతో ఉన్న కంటైనర్లు తెప్పిస్తున్న అంటూ ఓ వ్యాపారిని నకిలీ పత్రాలతో మోసం చేసినట్లు ఆమెపై కేసు నమోదైంది. 

దక్షిణాఫ్రికాకు చెందిన న్యూ ఆఫ్రికా అలియన్స్ ఫుట్వేర్ డిస్ట్రిబ్యూటర్ స్థానికంగా  చెప్పుల వ్యాపారం చేస్తుంటుంది.  అంతేగాక ప్రాఫిట్- షేర్ ఒప్పందం కింద ఇతర కంపెనీలకు రుణాలు కూడా ఇస్తుంది. ఈ కంపెనీ డైరెక్టర్ ఎస్ ఆర్ మహారాజును  2015 ఆగస్టు లో లతా రాంగోబిన్ కలిశారు. దక్షిణాఫ్రికా హాస్పిటల్ గ్రూప్  నెట్ కేర్ కోసం తాను భారత్ నుంచి మూడు లినెన్ కంటైనర్లను దిగుమతి చేసుకున్నానని, అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కస్టమ్స్ సుంకాలు చెల్లించలేక పోతున్నాం అని తెలిపారు.

మెహుల్ చోక్సీ : నమ్మిన అమ్మాయే ట్రాప్ చేసింది...కిడ్నాప్ కు సహకరించి......

హార్బర్ లో ఉన్నా కంటైనర్లను తెచ్చుకునేందుకు తనకు కొంత డబ్బు సహాయం కావాలని అడిగారు. ఇందుకుగాను తన లాభాల్లో షేర్ ఇస్తానని హామీ ఇచ్చారు.  ఉత్పత్తులను ఆర్డర్ చేసినట్లుగా కొన్ని పత్రాలు ఇన్వాయిస్ ఫ్రూఫ్ లుగా చూపించారు. 

లతా  రాంగోబిన్ కుటుంబ పరపతి, ఆ పత్రాలను చూసిన మహారాజ్ ఆమెతో ఒప్పందం చేసుకుని 6.2 మిలియన్ రాండ్ల నగదు ఇచ్చారు.  అయితే కొన్ని రోజులకే ఆమె చూపించిన పత్రాలు నకిలీవని, భారత్ నుంచి ఎలాంటి దిగుమతులు చేసుకోలేదని మహారాజుకు తెలిసింది. దీంతో ఆయన లతా  రాంగోబిన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 2015 లోనే ఈ కేసు విచారణ ప్రారంభం కాగా ఆమె బెయిల్ పై  బయటికి వచ్చారు. సోమవారం  తుది విచారణ జరిపిన డర్బన్ న్యాయస్థానం ఈ కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.  తీర్పు శిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదని కోర్టు తేల్చి చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios