Asianet News TeluguAsianet News Telugu

సముద్రంలో 12 గంటలు ఈది ప్రాణాలు నిలుపుకున్న మంత్రి.. ఎక్కడంటే...

మెడగాస్కర్ లోని ఈశాన్య ప్రాంతంలో పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి మంత్రి బృందం అక్కడికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది.  హెలికాప్టర్ లో ఉన్న మంత్రితో పాటు మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు.

Madagascar minister swims for 12 hours after helicopter crash
Author
Hyderabad, First Published Dec 23, 2021, 9:40 AM IST

మడగాస్కర్ :  Helicopter కుప్ప కూలిన ప్రమాదంలో Madagascar దేశ మంత్రి Serge Gelle ప్రాణాలతో బయటపడ్డారు.  ఆయన సాహసంతో  సుమారు 12 గంటల పాటు పోరాడి సముద్రంలో swimming చేసుకుంటూ బయటపడ్డారు.  తాను మరణించలేదని బతికే ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం ఐలాండ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. 

ఓ ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాదంలో 39 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి మంత్రి బృందం అక్కడికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది.  హెలికాప్టర్ లో ఉన్న మంత్రితో పాటు మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు.

Chinese mobile smartphone కంపెనీల‌కు ఐటీ షాక్‌..

ఈ ఘటన పట్ల  దేశ అధ్యక్షుడు Andre Rajolina  ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.  హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రితో పాటు మిగతా ఇద్దరు అధికారులు మరణించారని ఆయన Tributes అర్పించారు. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురూ ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతమైన మహాంబోకు చేరుకున్నారు.  హెలికాప్టర్ కూలి పోవడానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

ప్రమాదం జరిగిన తర్వాత తాను రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు సముద్రంలో ఈదుకుంటూ వచ్చినట్లు మంత్రి గేలె తెలిపారు. ఆయన వయసు 57 సంవత్సరాలు.  తనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బతికే ఉన్నానని మహాంబో గ్రామస్తులకు చెప్పారు. ఆయన హెలికాప్టర్ లోని ఒక సీటును సముద్రం నీటిలో తేలడానికి ఉపయోగించుకున్నారని పోలీస్ చీఫ్ జఫిసంబత్రా రావోవీ పేర్కొన్నారు. ఆయన క్రీడల్లో ఎల్లప్పుడూ గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించే వారిని, 30 ఏళ్ల వ్యక్తిలా బ్రతకడానికి పోరాడారని రావోవీ ప్రశంసించారు. 

7500 బిట్ కాయిన్లను చెత్త బుట్టలో పడేసిన భార్య.. నాసా శాస్త్రవేత్తలను రంగంలోకి దింపిన భర్త..

ఇదిలా ఉండగా, ఇండియాలో జరగిన హెలికాప్టర్ ప్రమాదంలో తమిళనాడులో భారత త్రివిధ దళాల అధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ తో పాటు 14మంది మరణించారు.

ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 12:4 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు నాజర్ బృందం తెలిపింది.  అదే రోజున ఉదయం 11:48 గంటలకు సూలూరు ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన హెలికాప్టర్ వెల్లింగ్టన్ ఎయిర్ బేస్ కు చేరాల్సి ఉంది. అయితే మార్గమధ్యలోనే హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ సహా 13 మంది మరణించారు. ఈ ప్రమాదంలో కెప్టన్ వరుణ్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ఆ తరువాత ఆయన కూడా మరణించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios