పెరూ లో హోరెత్తిన నిరసనలు: 42 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
Lima: పెరూలో నిరసనలు హోరెత్తున్నాయి. ఈ ప్రజా ఆందోళనల్లో ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి మరింత చేయిదాటే అవకాశాల క్రమంలో పెరూలో ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ పరిస్థితి పెరూ సైన్యానికి శాంతిభద్రతలను కాపాడటానికి మరింతగా జోక్యం చేసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. అలాగే, ప్రజా కదలికల స్వేచ్ఛ, సమావేశల స్వేచ్ఛ వంటి అనేక రాజ్యాంగ హక్కులను నిలిపివేస్తుంది.

Lima: పెరూలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ ప్రజా ఆందోళనల్లో ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి మరింత చేయిదాటే అవకాశాల క్రమంలో పెరూలో ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ పరిస్థితి పెరూ సైన్యానికి శాంతిభద్రతలను కాపాడటానికి మరింతగా జోక్యం చేసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. అలాగే, ప్రజా కదలికల స్వేచ్ఛ, సమావేశల స్వేచ్ఛ వంటి అనేక రాజ్యాంగ హక్కులను నిలిపివేస్తుంది.
నిరసనల్లో 42 మంది మృతి.. వందలాది మందికి గాయాలు
లాటిన్ అమెరికా దేశమైన పెరూలో నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు అక్కడ 42 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి మరింత చేయిదాటే అవకాశాల క్రమంలో పెరూలో ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ పరిస్థితి పెరూ సైన్యానికి శాంతిభద్రతలను కాపాడటానికి మరింతగా జోక్యం చేసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. అలాగే, ప్రజా కదలికల స్వేచ్ఛ, సమావేశల స్వేచ్ఛ వంటి అనేక రాజ్యాంగ హక్కులను నిలిపివేస్తుంది. పెరూ అధ్యక్షురాలు డినా బోలువార్డే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత డిసెంబర్ నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి వందలాది మంది పౌరులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పెద్ద సంఖ్యలో పౌరులు, పోలీసు అధికారులు గాయపడ్డారు.
పెరూలో ఎమర్జెన్సీ..
ఇటీవలి వారాల్లో కనీసం 42 మంది ప్రాణాలను బలిగొన్న నిరసనలు మరింత హింసాత్మకంగా మారకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది పెరూ ప్రభుత్వం. అధ్యక్షుడు దినా బోలువార్టేకు వ్యతిరేకంగా నిరసనల కారణంగా పెరూ రాజధాని లిమాతో పాటు మరో మూడు ప్రాంతాల్లో ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 30 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని తెలిపింది. తాజా చర్యలు శాంతిభద్రతలను కాపాడటానికి జోక్యం చేసుకోవడానికి సైన్యానికి మరింతగా అధికారం ఇస్తుంది. అలాగే, పౌరుల కదలిక స్వేచ్ఛ-సమావేశ స్వేచ్ఛ వంటి అనేక రాజ్యాంగ హక్కులను నిలిపివేస్తుందని అధికారిక గెజిట్ పేర్కొంది. రాజధానితో పాటు కుస్కో, పునో ప్రాంతాలు, లిమాకు ఆనుకుని ఉన్న కల్లావో ఓడరేవులో ఎమర్జెన్సీ విధించారు.
శనివారం పెరూ అంతటా, ప్రధానంగా నిరసనలకు కేంద్రంగా ఉన్న దక్షిణ ప్రాంతంలో, లిమా చుట్టుపక్కల 100కు పైగా రహదారులపై నిరసనకారులు ఆందోళనలు చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ పెరూ పర్యాటక రంగానికి కీలకమైన కుస్కో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తిరిగి తెరిచారు.
పెరూలో ఎందుకు ఈ నిరసనలు..?
పెరూ మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డిసెంబర్ లో నిరసనలు షురూ అయ్యాయి. కాస్టిల్లోను విడుదల చేయాలనీ, అధ్యక్షుడు డినా బోలువార్డే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. తనపై అభిశంసన ఓటును నిరోధించడానికి ప్రయత్నించి కాంగ్రెస్ ను రద్దు చేసి డిక్రీ ద్వారా పాలించడానికి ప్రయత్నించినందుకు అప్పటి అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను పదవి నుండి తొలగించిన తరువాత డిసెంబర్ ప్రారంభంలో సామూహిక ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.
కొత్త ఎన్నికలు నిర్వహించాలనీ, ప్రస్తుత నాయకుడు బొలువార్టేను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాస్టిల్లో మద్దతుదారులు దక్షిణ అమెరికా దేశమైన పెరూ వీధుల్లో బైఠాయించి నిరసనలు చేపట్టారు. కాస్టిల్లో మాదిరిగానే వామపక్ష పార్టీకి చెందిన అధ్యక్షురాలు బొలువార్టే తాను పదవి నుంచి వైదొలగబోనని స్పష్టం చేశారు. పెరూ ఇటీవలి సంవత్సరాలలో రాజకీయ అస్థిరతను ఎదుర్కొంది. 60 ఏళ్ల బోలువార్టే ఐదేళ్లలో అధ్యక్ష పదవిని నిర్వహించిన ఆరవ వ్యక్తి. తన పదవీకాలంలో పలు మోసాల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న కాస్టిల్లోకు తిరుగుబాటు అభియోగం మోపి 18 నెలల పాటు రిమాండ్ విధించారు.