వాషింగ్టన్: గురువారం నాడు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్ధుల చర్చా కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ భారత్ పై తన అక్కసును వెళ్లగక్కాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసున్న ట్రంప్, జో బైడెన్ లు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.  చైనాను చూడండి, ఇది ఎంత మురికిగా ఉంది. రష్యా వైపు చూడండన్నారు. భారతదేశం వైపు చూడండి ఇది మురికిగా ఉందని చెప్పారు.  గాలి మురికిగా ఉందని నాష్విల్లెలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గాలి కాలుష్యం గురించి ఇండియా, చైనా, రష్యాలు సరిగా పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుండి అమెరికా వైదొలగడాన్ని ఆయన సమర్ధించుకొన్నారు.

తాము ట్రిలియన్ డాలర్లను తీసుకోవాల్సి ఉన్నందున తాను పారిస్ ఒప్పందం నుండి వైదొలిగినట్టుగా చెప్పారు. వాతావరణ మార్పులపై ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

వాతావరణ మార్పులపై ఇండియా, చైనా దేశాలు సరిగా పట్టించుకోవడం లేదని ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈ దేశాల్లో గాలి పీల్చడానికి కూడ వీలుగా ఉండదని ఆయన పదే పదే ఆరోపణలు గుప్పించారు.

2015 పారిస్ ఒప్పందం నుండి  అమెరికా 2017లో వైదొలిగింది.గ్లోబల్ టెంపరేచర్ ను రెండు డిగ్రీల సెల్సియస్ ను తగ్గించడం ఈ ఒప్పందం ఉద్దేశం.

ఫారిస్ ఒప్పందం కారణంగా చైనా,ఇండియా దేశాలు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నాయని ఆయన నిరంతరం వాదించారు.

గత వారం కీలకమైన యుద్దభూమి స్టేట్ కరోలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో చైనా, రష్యా, భారత్ దేశాలు వాయు కాలుష్యానికి తోడ్పడుతున్నాయని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే.

మనకు ఉత్తమ పర్యావరణ సంఖ్యలు, ఓజోన్ సంఖ్యలున్నాయని ట్రంప్ చెప్పారు. ప్రపంచంలో అతి ఎక్కువగా కార్బన్ ఉద్గారిణిగా చైనా ఉంది. ఆ తర్వాతి స్థానంలో అమెరికా నిలిచింది.ఆ తర్వాతి స్థానాల్లో భారత్, ఈయూలు ఉన్నాయి.