ప్యాంట్ లో టాయ్ లెట్ వెళ్లాడని ఓ తొమ్మిదేళ్ల బుడ్డోడిపై సొంత అత్త దారుణంగా ప్రవర్తించింది. దారుణంగా చితకబాది.. బాత్ టబ్ లో పడేసింది. ఈ దారుణ సంఘటన అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జేమీ లైన్ జాక్సన్ కు పన్నెండేళ్ల లోపు వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మేనల్లుడు మిచెల్ స్టోవర్ వీరితో కలిసి ఆడుకుంటున్నాడు.

తొమ్మిదేళ్ల వయసున్న ఈ పిల్లవాడు ఎక్కడ పడితే అక్కడ టాయ్ లెట్ పోయడంతో  ఆమె కి బాగా కోపం వచ్చింది. దీంతో.. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా.. గ‌దిలోకి తీసుకు వెళ్లి చిత్ర హింస‌లు పెట్టింది. అత‌డి శ‌రీరాన్ని సిగ‌రెట్ల‌తో కాల్చింది. మెడ‌కు ప్లాస్టర్‌ను బిగుతుగా చుట్టి కిరాత‌కంగా ప్ర‌వ‌ర్తించింది. త‌ర్వాత‌ అత‌డిని బ‌ట్ట‌లో చుట్టి బాత్‌ట‌బ్‌లో ప‌డేసింది. అందులో నుంచి బ‌య‌ట‌కు రాలేక అత‌డు గిల‌గిలా కొట్టుకుంటున్నా ఆమె మ‌న‌సు చ‌లించ‌లేదు. 24 గంట‌ల నుంచి 48 గంట‌ల వ‌ర‌కు అత‌డి బాత్‌ట‌బ్‌లోనే వ‌దిలేసింది

మ‌రోవైపు త‌ను చేసిన నేరం బ‌య‌ట‌ప‌డ‌కుండా అత‌డి గ‌దినంతా శుభ్రం చేసింది. ఇది చూసిన ఆమె బంధువు అనుమానం వచ్చిపోలీసుల‌కు స‌మాచారం అందించాడు. కానీ పోలీసులు ఆ ఇంటికి చేరుకునేస‌రికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ప‌సివాడి ప్రాణం గాల్లో క‌లిసిపోయింది. అత‌డి చావుకు కార‌ణ‌మైన జాక్స‌‌న్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 డిసెంబ‌ర్ 2న ఆమెను కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా ‌హ‌త్యానేరంతో పాటు, మ‌ర‌ణాన్ని దాచ‌డం, సాక్ష్యాల‌ను తారుమారు చేయ‌డం, చిత్ర‌హింస‌లు పెట్ట‌డం వంటి అభియోగాల కింద ఆమెకు న్యాయ‌స్థానం జైలు శిక్ష‌ విధించింది. స్టోవ‌ర్ శ‌వ‌ప‌రీక్ష రిపోర్టులోనూ షాకింగ్ విష‌యాలు వెలుగు చూశాయి. అత‌డి త‌ల, క‌ళ్లు, మెడ‌, చేతులు, కాళ్లు తీవ్ర గాయాలు ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. మెద‌డులో ర‌క్త‌స్రావం జ‌రిగిందని తేలింది. ప్రైవేటు పార్ట్స్‌పై సిగ‌రెట్‌తో కాల్చిన గుర్తులు కూడా ఉన్న‌ట్లు రిపోర్టు పేర్కొంది.