Asianet News TeluguAsianet News Telugu

ఐర్లాండ్ ప్ర‌ధానిగా భార‌త సంత‌తి వ్య‌క్తి లియో వరద్కర్.. ప్రధాని మోదీ అభినందనలు

Ireland: రెండోసారి ఐర్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంత‌తి వ్య‌క్తి లియో వ‌ర‌ద్క‌ర్ కు అభినందనలు అంటూ ప్రధాని న‌రేంద్ర మోడీ ట్వీట్ చేశారు. "ఐర్లాండ్‌తో మా చారిత్రక సంబంధాలు, భాగస్వామ్య రాజ్యాంగ విలువలు-బహుముఖ సహకారానికి మేము చాలా ప్రాముఖ్యతనిస్తాము" అని పేర్కొన్నారు.  
 

Leo Varadkar, an Indian-origin man, is the Prime Minister of Ireland; Prime Minister Narendra Modi congratulated him.
Author
First Published Dec 18, 2022, 4:58 AM IST

Irish Prime Minister Leo Varadkar: 2020లో కుదిరిన సంకీర్ణ ఒప్పందానికి అనుగుణంగా ఐర్లాండ్ ప్రధానిగా భార‌త సంత‌తి వ్య‌క్తి లియో వరద్కర్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఐరిష్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతని ఫైన్ గేల్, మార్టిన్ ఫియాన్నా ఫెయిల్ పార్టీల మధ్య రొటేషన్ లో మైకేల్ మార్టిన్ స్థానంలో టావోయిసాచ్ (ప్రీమియర్) గా వరద్కర్ నియమించబడ్డాడు. 20 వ శతాబ్దం ప్రారంభంలో ఐరిష్ అంతర్యుద్ధంలో మూడు పార్టీల పాలక సంకీర్ణంలో రెండు ప్రధాన రాజకీయ భాగస్వాములైన సెంటర్-రైట్ పార్టీలు ప్రత్యర్థి పక్షాల నుండి ఏర్పడ్డాయి. 2020 ఎన్నికల తరువాత ఐర్లాండ్ గ్రీన్స్ తో సంకీర్ణంలో భాగంగా వారు రొటేటింగ్ ప్రధాని పదవికి అంగీకరించారు. 43 సంవత్సరాల వయస్సులో ఆయ‌న  ఇప్పటికీ ఐర్లాండ్ అత్యంత పిన్న వయస్కుడైన నాయకులలో ఒకరు. అలాగే, ప్ర‌ధానిగా రెండవసారి కూడా ఉండ‌టం విశేషం. 

ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన లియో వరద్కర్ కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. లియో వరద్కర్ భాగస్వామ్య రాజ్యాంగ విలువలు, దేశంతో బహుముఖ సహకారానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తార‌ని పేర్కొన్నారు. "రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లియోకు అభినందనలు. ఐర్లాండ్ తో మా చారిత్రక సంబంధాలు, రాజ్యాంగ విలువలను పంచుకోవడం, బహుముఖ సహకారానికి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తాము. మన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను" అని ప్ర‌ధాని మోడీ తెలిపారు.

 

ఐర్లాండ్ ప్ర‌ధాని అయిన లియా వరద్కర్ జనవరి 18, 1979 న డబ్లిన్ లో జన్మించారు. అతని తండ్రి అశోక్ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని వరడ్ గ్రామానికి చెందినవారు. ఆయ‌న‌ తల్లి మేరీ ఐర్లాండ్ నుండి వచ్చింది. నర్సుగా పనిచేసింది. అతని తండ్రి వృత్తిరీత్యా వైద్యుడు. 1960 లలో ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ లో పనిచేశారు. నర్సుగా పనిచేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న్ను ఇంగ్లాండ్ లో కలుసుకుంది. తరువాత అతను ఐర్లాండ్ లో స్థిరపడ్డాడు. లియో తన తండ్రి అశోక్ వరద్కర్ చిన్న కుమారుడు. అతని ప్రారంభ విద్య సెయింట్ ఫ్రాన్సిస్ నేషనల్ స్కూల్ లో జరిగింది. లియో డబ్లిన్ లోని ట్రినిటీ కళాశాలలో మెడిసిన్ చదివాడు. కేవలం 24 సంవత్సరాల వయస్సులో, అతను 2007 లో డబ్లిన్ వెస్ట్ నుండి కౌన్సిలర్ అయ్యాడు. ఆ సమయంలో లియో రవాణా, పర్యాటకం-క్రీడల మంత్రిగా నియమించబడ్డాడు. అయితే 2014లో ఆయనకు ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. 

లియో వరద్కర్ 2020 లో ఉప ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో, దేశం కోవిడ్ మహమ్మారితో పోరాడుతోంది. అయితే, కోవిడ్ సమయంలో ఆయ‌న అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఇంటి నుండి పని త్వరలో సాధారణమవుతుందని చెప్పారు. లియో వరద్కర్ గతంలో 2017 నుంచి 2020 వరకు ఐర్లాండ్ ప్రధానిగా పనిచేశారు. ఆయ‌న ఐర్లాండ్ దేశ పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి రికార్డు సృష్టించారు.

Follow Us:
Download App:
  • android
  • ios