Asianet News TeluguAsianet News Telugu

గంజాయి‌ సమ్మేళనాలతో కోవిడ్-19ను నిరోధించవచ్చు.. తాజా సర్వేలో సంచలన విషయాలు.. మరి స్మోక్ చేసే వారి సంగతేమిటి..?

ప్రపంచవ్యాప్తంగా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు సంబంధించిన మార్గాలపై శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించిన ఓ తాజా అధ్యయనంలో సంచలనాత్మక విషయాలు వెల్లడయ్యాయి.

latest study says Cannabis compounds can keep Covid-19 virus from entering human cells
Author
Washington D.C., First Published Jan 16, 2022, 8:43 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు సంబంధించిన మార్గాలపై శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి పరిశోధనల్లో పలువురు పరిశోధకులు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించిన ఓ తాజా అధ్యయనంలో సంచలనాత్మక విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ నివారణకు గంజాయి కీలకమని  పేర్కొంది. ఇందుకు కారణం ఈ మొక్కలో.. వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించకుండా నిరోధించే సమ్మేళనాలు ఉన్నాయని తెలిపింది. 

రిచర్డ్ వాన్ బ్రీమెన్, ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధన ప్రకారం.. hemp(గంజాయి)లో సాధారణంగా కన్నాబిడియోలిక్ యాసిడ్ అని పిలువబడే సమ్మేళనాలు SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్‌తో బంధించగలవు. అంతేకాకుండా రస్ మానవులకు సోకే ప్రక్రియలో ముఖ్యమైన దశను నిరోధించగలవు.  ఈ అధ్యయనం 'జర్నల్ ఆఫ్ నేచురల్ ప్రొడక్ట్స్' అనే జర్నల్‌లో ప్రచురించబడింది.

ఈ అధ్యయనం వెలువడినప్పటి నుంచి.. Marijuana (గంజాయికి మరొక సాధారణ పేరు) స్మోక్ చేయడం అనేది కోవిడ్ -19 ను దూరంగా ఉంచడంలో సహాయపడుతుందా..? ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. అయితే ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం 'లేదు'.

అయితే ఓ ఇంటర్వ్యూలో బ్రీమెన్ మాట్లాడుతూ.. ‘hemp‌లో మేము కనుగొన్న క్రియాశీల సమ్మేళనాలు.. కన్నాబిడియోలిక్ యాసిడ్, CBD-A, CBG-A, THC-A. ఇక్కడ A అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్.. దీనిని చికిత్స తర్వాత తొలగించవచ్చు. అయితే ఈ సమ్మేళనాలు గల hempను పొగబెట్టడం గానీ, వేడిచేయడం గానీ చేసినట్టయితే.. వేడి బహిర్గతం కావడం వల్ల రసాయనం కుళ్లిపోవడానికి లేదా CBD-Aని CBDగా, CBG-Aని CBGగా, THC-Aని THCగా మార్చడానికి కారణమవుతుంది. కావున CBD, CBG, THC వైరస్‌కు వ్యతిరేకంగా చురుకుగా లేవని మాకు తెలుసు. అందుకే ఈ సమ్మేళనాలను స్మోక్ చేయకుండా, వాపింగ్ నుండి పీల్చుకునే బదులు నోటి ద్వారా నిర్వహించాలని మేము సిఫార్సు చేస్తాము’ అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios