Asianet News TeluguAsianet News Telugu

దేశంలో అతిపెద్ద నకిలీ కరెన్సీ సరఫరాదారు లాల్ మొహమ్మద్ హత్య

Fake notes supplier: దేశంలోనే అతి పెద్ద నకిలీ కరెన్సీ సరఫరాదారుడైన లాల్ మొహమ్మద్ అలియాస్ మొహమ్మద్ దర్జీ (55)ని నేపాల్ రాజధాని ఖాట్మండూలో తను ఉంటున్న రహస్య ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 
 

Lal Mohammad, the biggest fake currency supplier, was killed
Author
First Published Sep 22, 2022, 1:15 PM IST

ISI agent Lal Mohammad: దేశంలోనే అతి పెద్ద నకిలీ కరెన్సీ సరఫరాదారుడైన లాల్ మొహమ్మద్ అలియాస్ మొహమ్మద్ దర్జీ (55)నినేపాల్ లో తాను ఉంటున్న రహస్య ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నేపాల్‌లోని ఖాట్మండులో ఒక రహస్య స్థావరం వెలుపల ఐఎస్ఐ ఏజెంట్ లాల్ మహ్మద్‌ను కాల్చి చంపిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకెళ్తే.. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి ఏజెంట్‌గా పనిచేస్తున్న దేశంలోనే అతి పెద్ద నకిలీ కరెన్సీ సరఫరాదారుడైన లాల్ మొహమ్మద్ అలియాస్ మొహమ్మద్ దర్జీ సెప్టెంబర్ 19న నేపాల్‌లోని ఖాట్మండులో అతని రహస్య స్థావరం వెలుపల కాల్చి చంపబడ్డాడు. భారతదేశంలో నకిలీ నోట్లను అత్యధికంగా సరఫరా చేసే వ్యక్తి అని ఇంటెల్ ఏజెన్సీలు మీడియాకు తెలిపాయి. అతన్ని కాల్చి చంపిన సంఘటన అక్కడి కెమెరాలో రికార్డు అయింది. ఐఎస్‌ఐ సూచన మేరకు లాల్ మహ్మద్ పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి నకిలీ భారత కరెన్సీని నేపాల్‌కు తరలించి అక్కడి నుంచి భారత్‌కు సరఫరా చేసేవాడు. అధికారుల ప్రకారం, లాల్ మహ్మద్ కూడా లాజిస్టిక్స్ మద్దతుతో ఐఎస్‌ఐ సహాయం చేసాడు. అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం D-గ్యాంగ్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని కూడా తెలిపారు. అలాగే, ఇతర ISI ఏజెంట్లకు కూడా ఆశ్రయం కల్పించాడు.

అక్కడి సీసీటీవీ దృశ్యాలు ఇలా... 

ఖాట్మండులోని గోతాటర్ ప్రాంతంలో లాల్ మహ్మద్ తన ఇంటి వెలుపల ఒక విలాసవంతమైన కారు నుండి ఎలా దిగిపోయాడో సీసీటీవీ ఫుటేజీలో చూపబడింది. కొద్దిసేపటికే ఇద్దరు దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. లాల్ మహ్మద్ తన కారు వెనుక దాక్కోవడానికి ప్రయత్నించాడు, అయితే దుండగులు కాల్పులు కొనసాగించారు. అతన్ని తప్పించుకోకుండా కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లాల్ మహ్మద్ కుమార్తె తన తండ్రిని రక్షించడానికి ఇంటి మొదటి అంతస్తు నుండి ఎలా దూకిందో కూడా CCTV దృశ్యాల్లో కనిపించింది. అయితే, ఆమె తన తండ్రి వద్దకు చేరుకునే సమయానికి దుండగులు మహ్మద్‌ను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios