Hardeep Singh Nijjar shot dead: కెనడాలో ఖలిస్థాని లీడ‌ర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కాల్చి చంపారు. బ్రాంప్టన్ లో ఖలిస్థాన్ రెఫరెండం నిర్వహించడంలో నిజ్జర్ కీలక పాత్ర పోషించారు. గురునానక్ సిక్కు గురుద్వార‌ సర్రేలో ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపార‌ని స్థానిక మీడియా పేర్కొంది. 

Khalistani leader Hardeep Singh Nijjar: కెనడాలో ఖలిస్థాని లీడ‌ర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కాల్చి చంపారు. బ్రాంప్టన్ లో ఖలిస్థాన్ రెఫరెండం నిర్వహించడంలో నిజ్జర్ కీలక పాత్ర పోషించారు. గురునానక్ సిక్కు గురుద్వార‌ సర్రేలో ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపార‌ని స్థానిక మీడియా పేర్కొంది.

వివ‌రాల్లోకెళ్తే.. కెనడాకు చెందిన ప్రముఖ ఎస్ఎఫ్ జే నేత, ఖలిస్థానీ నాయ‌కుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ గురునానక్ సిక్కు గురుద్వార సర్రేలో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఈ గురుద్వారాకు అధ్యక్షులుగా ఉన్నారు. కెనడాలోని సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) ప్రముఖ ముఖంగా ఆయ‌న గుర్తింపు ఉంది. ఆయ‌న వివ‌రాలు తెలిపాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రూ.లక్ష రివార్డును ప్రకటించింది. గత ఏడాది 2022లో అతనిపై 10 లక్షలను ప్ర‌క‌టించింది.

నిజ్జర్ భారతదేశంలో నిషేధించబడిన వేర్పాటువాద సంస్థ, సిక్కు ఫర్ జస్టిస్ (SFJ)తో సంబంధం కలిగి ఉన్నాడు. బ్రాంప్టన్ నగరంలో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ నిజ్జర్‌పై గతంలో చార్జిషీట్ దాఖలు చేసింది. పంజాబ్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజ్జర్‌పై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను ఇంత‌కుముందు భారత్ కోరింది.