: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హరీస్ కీలక ప్రకటన చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతికి చెందిన మహిళాగా ఆమె రికార్డు సృష్టించారు. అయితే ఆమె చివరి వ్యక్తి కాదని ఆమె స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హరీస్ విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆమె ప్రజలను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు.

 

ప్రతి ఒక చిన్న అమ్మాయి ఈ రాత్రి చూసింది. అది ఈ దేశంలో ఉన్న అవకాశాలను తెలుసుకొన్నారు. ఇంకా దేశంలో ఉన్న పిల్లలంతా లింగ వివక్షతో సంబంధం లేకుండా స్పష్టమైన సందేశం ఇచ్చిందని ఆమె చెప్పారు.

ఆశయంతో కలలు కనండి, నమ్మకంతో ఆశయాల సాధన కోసం ముందుకు సాగాలని ఆమె కోరారు. ఇతరులు మిమ్మల్ని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా చూస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. అడుగడుగునా మిమ్మల్ని మెచ్చుకొంటారని తెలుసుకొంటారని ఆమె చెప్పారు.

 

కమలా హరీస్ ఈ సందర్భంగా తన తల్లిని గుర్తు చేసుకొన్నారు. తన తల్లి శ్యామలన్ గోపాలన్ హరీస్ తన కూతురు అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక అవుతోందని ఏనాడూ ఊహించకపోయి ఉండవచ్చన్నారు.

also read:బెస్ట్ ఫ్రెండ్స్: బైడెన్, ఒబామా మధ్య స్నేహం ఎలా చిగురించిందంటే?

నల్లజాతి, ఆసియా, తెలుపు, లాటిన్, అమెరికన్ మహిళలకు వారి కలలను సాకారం చేసుకోవచ్చనే ధీమా ఈ రాత్రితో దక్కిందనే అభిప్రాయపడ్డారు.అందరికీ సమానత్వం, న్యాయం, త్యాగం చేసిన మహిళలు ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని నిరూపిస్తున్నారని ఆమె చెప్పారు.

మహిళలు ఓట్లు వేయడానికి ఎలా వచ్చారో.. వారి ప్రాథమిక ఓటు వేయడానికి ఎలా వచ్చారో ఆమె నొక్కి చెప్పారు. మహిళల పోరాటం, సంకల్పం, వారి దృష్టిని తాను ప్రతిబింబిస్తానన్నారు.