అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ వ్యవహారంపై కేఏ పాల్ విరుచుకుపడ్డారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడైన కేఏ పాల్ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదని అన్నాడు. పూర్తిగా కాకముందే తాను గెలిచినట్టు ట్రంప్ ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. 

కొన్ని స్టేట్స్ లో ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉందన్నారు. అంతేకాదు ఓట్ల లెక్కింపు ఆపాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్తానన్న ట్రంప్ తీరును ఆయన తప్పుబట్టారు. ఇటీవలే ట్రంప్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించారు. తను నియమించాడు కాబట్టి వారంతా తనకు అనుకూలంగా ఉంటారని ఆయన భావిస్తున్నారు. 

అందుకే సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ ట్రంప్ డ్రామా చేస్తున్నారని పాల్ చెప్పారు. ట్రంప్ తన ఓటమిని ముందే పసి గట్టేసి అది జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.