Asianet News TeluguAsianet News Telugu

నూర్ బతికుండగానే చిత్రవధ..కత్తిగాట్లు, సూదిపోట్లు, తగలబెట్టి.. గొంతుకోసి.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు.. !

నూర్‌ ముకదమ్‌.. పాకిస్థాన్‌ మాజీ దౌత్యవేత్త షౌకత్‌ ముకదమ్‌ కూతురు.  గతంలో ఆయన సౌత్ కొరియా, కజకిస్థాన్ లకు రాయబారిగా పని చేశారు. ఆయన కూతురు నూర్ (27) మంగళవారం రాత్రి ఇస్లామాబాద్ సెక్టార్‌ ఎఫ్‌-7/4 లోని ఓ ఇంట్లో ఘోర హత్యకు గురైంది. 

JusticeForNoor : Shock and horror in Pakistan over gruesome murder of ex-envoys daughter - bsb
Author
Hyderabad, First Published Jul 26, 2021, 11:31 AM IST

పాకిస్తాన్ : మరో ఘోర ఘటన అంతర్జాతీయ సమాజంలో ఆడవాళ్ళ భద్రత- రక్షణ మీద చర్చకు దారితీసింది. నూర్‌ ముకదమ్‌ అనే యువతిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన పాక్ ను అట్టుడికిపోయేలా చేస్తుంది. పాక్ మాజీ దౌత్యవేత్త కూతురైన నూర్ ను ఆమె స్నేహితులే క్రూరంగా హింసించి చంపారు. 
అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు మానసిక స్థితి బాగోలేదని పోలీసులు చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది.  #Justicefornoor హ్యాష్‌ట్యాగ్‌ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

నూర్‌ ముకదమ్‌.. పాకిస్థాన్‌ మాజీ దౌత్యవేత్త షౌకత్‌ ముకదమ్‌ కూతురు.  గతంలో ఆయన సౌత్ కొరియా, కజకిస్థాన్ లకు రాయబారిగా పని చేశారు. ఆయన కూతురు నూర్ (27) మంగళవారం రాత్రి ఇస్లామాబాద్ సెక్టార్‌ ఎఫ్‌-7/4 లోని ఓ ఇంట్లో ఘోర హత్యకు గురైంది.  ఆ ఇల్లు ఆమె స్నేహితుడు జహీర్ జకీర్ జాఫర్ ది.  అయితే ఈ హత్య జహీర్ చేసిందేనని నిర్ధారించిన పోలీసులు.. శనివారం దాకా అతన్ని అరెస్టు చేయలేదు.

అంతే కాదు అతని మానసిక స్థితి సరిగా లేదని, అతనిని చికిత్స కోసం తరలించాలని ఇస్లామాబాద్  పోలీసులు కోర్టును ఆశ్రయించడంపై జనాల్లో ఆగ్రహావేశాలు రాజుకున్నాయి.  వేల సంఖ్యలో బ్యానర్లు చేతబట్టి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం ఉదయం బక్రీదు కోసమని గొర్రెను కొనడానికి రావల్పిండి కి వెళ్ళాడు షౌకత్.  ఆయన భార్య కొత్త బట్టల కోసం బయటకు వెళ్లింది.  వచ్చి చూసే సరికి కూతురు ఇంట్లో లేదు.  తన స్నేహితులతో బయటకు వెళ్తున్నానని, ఒకటి రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది ఆమె.  మంగళవారం మధ్యాహ్నం ఫోన్ స్విచాఫ్ రాగా.. ఆమె తన దగ్గర లేదని జకీర్ బదులిచ్చాడు. అదే రోజు రాత్రి ఆమె మృతదేహం దొరికినట్లు ఖోహ్‌సర్‌ పోలీసులు షౌకత్‌కు సమాచారం అందించారు.

నూర్ పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.  బతికుండగానే ఆమెను చిత్ర వధ చేశారు. ఆమె ఒంటిపై అన్ని చోట్ల కత్తి గాట్లు పెట్టారు. సూదులతో వీపులో గుచ్చారు.  జుట్టు కత్తిరించేశారు.  ఆమె శరీరాన్ని తగలబెట్టి పదునైన ఆయుధంతో పీక కోశారు.

తల మొండెం వేరు చేసి దూరంగా పడేశారు. ఈ పైశాచిక ఘటనతో ఒక్కసారిగా పాక్ ఉలిక్కి పడింది.  అయితే అత్యాచారానికి గురైందన్న బాధితురాలి తండ్రి అనుమానాలపై డాక్టర్ల నుంచి పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. మరోవైపు ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు.

రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో శనివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇస్లామాబాద్లో ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఈఓ జకీర్‌ జాఫర్‌.  అతని కొడుకు  జహీర్‌ జకీర్‌ జాఫర్‌.   పైగా జహీర్ కొన్నాళ్లు అమెరికాలో ఉండి వచ్చాడు.  మానసిక స్థితి బాగానే ఉందని, పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని,  రాజకీయ పలుకుబడితో బయటపడే ప్రయత్నం చేస్తున్నారని జనాలు ఆరోపిస్తున్నారు. అయితే నిందితుడు ఎట్టిపరిస్థితిలో తప్పించుకోలేడని కఠినంగా శిక్షించి తీరతామని కేంద్ర మంత్రులు హామీ ఇస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios