Asianet News TeluguAsianet News Telugu

విజయవంతమైన జెఫ్ బెజోస్ రోదసీ యాత్ర.. క్షేమంగా భూమిని చేరిన న్యూషెపర్డ్

ఆమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ వ్యోమనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి క్షేమంగా భూమి మీదకు తిరిగి వచ్చింది. వర్జిన్ గెలాక్టిక్ వెళ్లిన ఎత్తుకంటే ఎక్కువగా అంటే 106 కిలోమీటర్ల ఎత్తుకు న్యూషెపర్డ్ వెళ్లింది.

Jeff Bezos Blue Origin New Shepard safely lands ksp
Author
Washington D.C., First Published Jul 20, 2021, 6:59 PM IST

ఆమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ వ్యోమనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి తిరిగి క్షేమంగా భూమిని చేరింది. ఆయనతో పాటు నలుగురు సభ్యులు వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లారు. అలాగే 82 ఏళ్ల మహిళా పైలట్ వేలీ ఫంక్ కూడా వున్నారు. తద్వారా ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా వేలీ ఫంక్ రికార్డు సృష్టించారు. అలాగే రోదసీలోకి వెళ్లిన అత్యంత పిన్న వయస్కుడిగా 18 ఏళ్ల ఆలివర్ డేమన్ రికార్డు సృష్టించారు. న్యూషెపర్డ్‌లో నాలుగో వ్యక్తిగా జెజోస్ సోదరుడు మార్క్ రోదసిలోకి వెళ్లారు. వేలంలో 2.8 కోట్ల డాలర్లు పెట్టి టికెట్ కొన్న వ్యక్తి మాత్రం అనివార్య కారణాలతో ప్రయాణానికి దూరమయ్యారు. వర్జిన్ గెలాక్టిక్ వెళ్లిన ఎత్తుకంటే ఎక్కువగా అంటే 106 కిలోమీటర్ల ఎత్తుకు న్యూషెపర్డ్ వెళ్లింది. ఈ నెల 11న వర్జిన్ గెలాక్టిక్ 88 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios