దేశ ఈశాన్య తీరంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ శనివారం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.09 ప్రాంతంలో మియాగి ప్రాంతంలోని సముద్రంలో బలమైన భూకంపం సంభవించింది. సముద్రంలో 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.