బిడ్డకు పాలు ఇవ్వడం కోసం రూ.35లక్షల ఖర్చు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 5, Sep 2018, 12:28 PM IST
Jacinda Ardern queried for taking costly flight to minimise time away from baby
Highlights

 ప్రయాణంలో తన బిడ్డకు పాలివ్వడానికి వీలుగా ఉంటుందని భావించి ఆర్డర్న్‌ ఇలా చేశారు. సమావేశానికి హాజరయ్యే సమయంలో ఆర్డర్న్‌ తన బిడ్డకు పాలు ఇస్తూ ఉండి పోవడం వల్ల.. పీటర్స్‌ అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తన బిడ్డకు పాలు ఇవ్వడం కోసం ఓ తల్లి అక్షరాలా రూ.35లక్షల ప్రజాధనం ఖర్చు చేశారు. ఆమె ఎవరో కాదు.. న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డర్న్‌. ప్రధాని పదవిలో ఉండి కూడా బిడ్డకు జన్మనిచ్చి ఆదర్శంగా నలిచారంటూ ఒకప్పుడు ప్రశంసలు కురిపించిన ఆ దేశ ప్రజలే ఇప్పుడు.. ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశాధ్యక్షురాలు కావడంతో జెసిండా ఆర్డర్న్ కేవలం రెండు నెలలు మాత్రమే మెటర్నటి సెలవులు తీసుకుని, అనంతరం తన చిన్నారితో కలిసి విధులకు హాజరవుతున్నారు.ఈ క్రమంలో ఈ నెల 1 - 9 వరకూ నౌరులో జరగనున్న ‘పసిఫిక్‌ ఐస్‌ల్యాండ్స్‌ సమ్మిట్‌’కి ఆర్డర్న్‌ తన చిన్నారితో కలిసి హాజరయ్యారు. అయితే ఈ సమ్మిట్‌కి ఆర్డర్న్‌తో పాటు ఉప ప్రధాని విన్‌స్టన్‌ పీటర్స్‌ కూడా హాజరయ్యారు. 

ఒకే కార్యక్రమానికి హాజరవుతోన్న ప్రధాని, ఉప ప్రధాని మాత్రం రెండు వేర్వేరు విమానాల్లో ప్రయాణించారు. ప్రయాణంలో తన బిడ్డకు పాలివ్వడానికి వీలుగా ఉంటుందని భావించి ఆర్డర్న్‌ ఇలా చేశారు. సమావేశానికి హాజరయ్యే సమయంలో ఆర్డర్న్‌ తన బిడ్డకు పాలు ఇస్తూ ఉండి పోవడం వల్ల.. పీటర్స్‌ అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఒకే సమావేశానికి హాజరవ్వడం కోసం ప్రధాని, ఉప ప్రధాని ఇలా రెండు వేర్వేరు విమానాల్లో ప్రయాణించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై 50,000(మన కరెన్సీలో దాదాపు 35 లక్షల రూపాయలు) డాలర్లు అదనపు భారం పడిందని హెరాల్డ్‌ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనిపై కివి ప్రజలు స్పందిస్తూ.. ‘ఇంత డబ్బు ఖర్చు చేసి మీరు ఆ కార్యక్రమానికి హాజరవ్వడం అంత అవసరమా.. ఒక వేళ మీ డిప్యూటీ వెళ్తే సరిపోయేది అనుకుంటే అతన్నే పంపిస్తే అయిపోయేదిగా’ అంటూ ఆర్డర్న్‌ని విమర్శిస్తున్నారు. కానీ ఆమెకు మద్దతు తెలిపే వారు మాత్రం.. ‘ఆర్డర్న్‌ తల్లిగా, దేశాధ్యక్షురాలిగా రెండు బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించించార’ని మెచ్చుకుంటున్నారు.

ఈ విషయం గురించి ఆర్డర్న్‌ని వివరణ కోరగా.. ‘నేను ప్రత్యేక విమానంలో సమావేశానికి హాజరయినందుకు ఇంత రాద్ధంతం చేస్తున్నారు కదా.. ఒకవేళ నేను హాజరుకాకపోయినా ఇలానే విమర్శించేవారు. వీటన్నింటిని పట్టించుకుంటే మనం ముందుకు సాగలేమ’ని తెలిపారు.

loader