ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ నాయకుడు అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీని అమెరికా ప్రత్యేక ఆపరేషన్ దళాలు హతమార్చాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం తెలిపారు. వాయువ్య సిరియాలో యూఎస్ బలగాలు ISIS నాయకుడు మట్టుబెట్టాయని పేర్కొన్నారు.
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ నాయకుడు అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీ (Abu Ibrahim al-Hashimi al-Qurayshi)ని అమెరికా ప్రత్యేక ఆపరేషన్ దళాలు హతమార్చాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (US President Joe Biden) గురువారం తెలిపారు. వాయువ్య సిరియాలో యూఎస్ బలగాలు ISIS నాయకుడు మట్టుబెట్టాయని పేర్కొన్నారు. పెంటగాన్ వర్గాల ప్రకారం.. వాయువ్య సిరియా (northwest Syria)లో అమెరికా ప్రత్యేక బలగాలు పెద్ద ఎత్తున తీవ్ర వాద వ్యతిరేక ఆపరేషన్ ను కొనసాగించాయి. విజయవంతంగా కొనసాగించిన ఈ ఆపరేషన్ లో మోస్ట్ వాంటెట్ ఉగ్రవాది.. ఐసిస్ (ఐఎస్ఐఎస్) నాయకుడు అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీని అమెరికా ప్రత్యేక బలగాలు (U.S. special operations forces)కాల్చి చంపాయి.
దీని గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) మాట్లాడుతూ.. "నా దిశానిర్దేశం మేరకు గత రాత్రి, వాయువ్య సిరియాలోని యుఎస్ సైనిక దళాలు (U.S. special operations forces) అమెరికన్ ప్రజలను, మా మిత్రదేశాలను రక్షించడానికి, ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి ఉగ్రవాద నిరోధక చర్యను విజయవంతంగా చేపట్టాయి" అని బిడెన్ వెల్లడించారు. "మా సాయుధ దళాల నైపుణ్యం మరియు ధైర్యసాహసాలకు ధన్యవాదాలు, మేము ISIS నాయకుడు అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీ (Abu Ibrahim al-Hashimi al-Qurayshi)ని మట్టుబెట్టాము. అమెరికన్లందరూ ఆపరేషన్ నుండి సురక్షితంగా తిరిగి వచ్చారు. దేవుడు మన సైనికులను రక్షించుగాక" అంటూ ఆయన బైడెన్ (US President Joe Biden) తన ప్రకటనలో పేర్కొన్నారు.
