Pakistan Mosque Blast: పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడు కలకలం సృష్టించింది. పెషావర్‌లోని షియా ముస్లిం మసీదులో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ ప్రకటించింది.
Pakistan Mosque Blast: పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడు కలకలం సృష్టించింది. పెషావర్‌లోని షియా ముస్లిం మసీదులో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుడులో దాదాపు 56 మంది మరణించినట్టు తెలుస్తోంది. అలాగే.. 194 మంది గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందనీ, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
పెషావర్‌లోని(Peshawar) పాతబస్తీలోని కుచా రిసల్దార్ మసీదులో శుక్రవారం ప్రార్థనల కోసం ప్రజలు పెద్దఎత్తున చేరుకున్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి సంభవించినట్టు తెలుస్తోంది. అంబులెన్స్‌లు ద్వారా క్షతగాత్రులను ఇరుకైన వీధుల నుంచి లేడీ రీడింగ్ హాస్పిటల్‌కు తీసుకెళుతున్నారు.
పాకిస్థాన్ మసీదు పేలుళ్లకు ఐఎస్ఐఎస్ బాధ్యత వహిస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఫైటర్ పెషావర్‌లోని షియా మసీదుపై దాడి చేయడంలో విజయం సాధించాడని అని వాయువ్య పాకిస్తాన్‌లో, ట్రాన్స్‌నేషనల్ జిహాదిస్ట్ గ్రూప్ తన అమాక్ ప్రచార సైట్‌లో తెలిపింది.
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, హింసాత్మక పాకిస్తానీ తాలిబాన్ సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతంలో ఇలాంటి దాడులను నిర్వహించాయి. మరోవైపు ఈ బాంబు దాడిని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. మెజారిటీ సున్నీ ముస్లింలు ఉన్న పాకిస్థాన్‌లో(Pakistan) తక్కువ సంఖ్యలో ఉన్న షియా ముస్లింలు పదే పదే దాడులకు గురవుతున్నారు.
