Asianet News TeluguAsianet News Telugu

పరువు హత్య : దర్శకుడిని ముక్కలుగా నరికిన తల్లిదండ్రులు.. చెత్త కుప్పలో శరీరభాగాలు

ఖోర్రామ్డిన్‌ దారుణ హత్య ఇరాన్‌లో సంచలనం సృష్టించింది. దర్శకుడి పొరుగింటి వారు తమ నివాసం ఎదురుగా ఉన్న చెత్తకుప్పలో కొన్ని మానవ శరీర భాగాలున్నాయని పోలీసులకు తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది

Iran stunned by case of couple who drugged and dismembered son ksp
Author
Iran, First Published May 22, 2021, 9:35 PM IST

భారతదేశంలో పరువు హత్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కులం తక్కువనో, పరాయి మతమనో, ఆస్తి తక్కువగా వుందనో ఇలా కారణమేదైనా దేశంలో పరువు హత్యలు నానాటికీ పెరుగుతున్నాయి. పరువు పోతుందన్న కక్షతో కన్నబిడ్డలన్న కనికరం కూడా లేకుండా వారిని కడతేరుస్తున్నారు తల్లిదండ్రులు.

పరువు హత్యలు ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు.. ప్రపంచంలో ఏ మూల చూసినా ఇలాంటివి కనిపిస్తాయి. తాజాగా ఇరాన్‌కు చెందిన దర్శకుడు బాబక్‌ ఖోర్రామ్డిన్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఖోర్రామ్డిన్‌ను అతడి తల్లిదండ్రులే దారుణంగా హత్య చేశారు. నిందితులు కేవలం ఖోర్రామ్డిన్‌ని మాత్రమే కాక వారి కుమార్తె, అల్లుడిని కూడా కొన్నేళ్ల క్రితం దారుణంగా హత్య చేసినట్లు మరో కొత్త విషయం వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే.. ఖోర్రామ్డిన్‌ దారుణ హత్య ఇరాన్‌లో సంచలనం సృష్టించింది. దర్శకుడి పొరుగింటి వారు తమ నివాసం ఎదురుగా ఉన్న చెత్తకుప్పలో కొన్ని మానవ శరీర భాగాలున్నాయని పోలీసులకు తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా అక్కడ రెండు తెగిపడిన చేతులు కనిపించాయి. ఫింగర్‌ ప్రింట్స్‌ ఆధారంగా అవి ప్రముఖ దర్శకుడు ఖోర్రామ్డిన్‌విగా గుర్తించారు. దీంతో స్థానికులు, పోలీసులు అందరి దృష్టి అతడి తల్లిదండ్రుల మీదనే పడింది. 

దీంతో పోలీసులు ఖోర్రామ్డిన్‌ తల్లిదండ్రులు ఇరాన్ ఖోర్రామ్దిన్( 74), అక్బర్ ఖోర్రామ్దిన్‌(81)లను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ కొడుకుని తామే హత్య చేశామని వారు నేరాన్ని అంగీకరించారు. ఖోర్రామ్డిన్‌ తండ్రి మాట్లాడుతూ.. గత శుక్రవారం తన భార్యతో చికెన్‌ కూర వండించి దానిలో విషం కలిపామని చెప్పాడు. కానీ నా కుమారుడు భోజనం చేయకుండా తన గదిలోకి వెళ్లి పడుకున్నాడని, దీంతో చికెన్‌ ఫ్రిజ్‌లో పెట్టామన్నారు. మరుసటి రోజు తింటాడని భావించామని.. కానీ అలా జరగలేదని.. తర్వాతి రోజు ఖోర్రామ్డిన్ బయటకు వెళ్లి వచ్చే వరకు ఆగామన్నారు.

Also Read:లక్షన్నర ఇచ్చి కూతుర్ని సజీవదహనం చేయించిన తండ్రి.. యూపీలో పరువు హత్య !!

సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటికి వచ్చిన తన కుమారుడిని కుర్చీకి కట్టేసి.. తలకు ప్లాస్టిక్‌ ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి ఊపిరాడకుండా చేశామని...అనంతరం కత్తితో పొడిచి హతమార్చినట్లు అక్బర్ వెల్లడించారు. ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు గాను మృతదేహాన్ని ముక్కలుగా నరికి రెండు సూట్‌కేస్‌లలో సర్ది.. చెత్తకుప్పలో పడేశామని తెలిపారు. బాబక్‌ ఖోర్రామ్డిన్‌ తన కోచింగ్‌ సెంటర్‌లోని విద్యార్థులతో సంబంధం పెట్టుకున్నాడని.. దాని వల్ల సమాజంలో తమ పరువు పోతుందనే ఉద్దేశంతోనే అతడిని హతమార్చినట్లు తల్లిదండ్రులు అంగీకరించారు. అంతేకాక కొన్నేళ్ల క్రితం కూడా తమ కుమార్తె, ఆమె భర్తను కూడా ఇలానే హత్య చేశామని పేర్కొన్నారు.

కుమార్తె డ్రగ్స్‌కు అలవాటు పడిందని.. అల్లుడు తమను తిడుతూ.. శాపనార్థాలు పెట్టేవాడని.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తాము వారిద్దరిని హతమార్చినట్లు ఖోర్రామ్డిన్ వెల్లడించారు. బిడ్డలను తమ చేతులతోనే చంపుకోవడం పట్ల తమకేం బాధ కలగడం లేదని వారు పేర్కొన్నారు. తమ బిడ్డలు తప్పుడు మార్గంలో పయణిస్తున్నారని.. వారి వల్ల మా పరువు పోతుంది. అందుకే చంపేశామని అక్బర్ అన్నాడు. 

మరణించిన ఖోర్రామ్డిన్‌ ‘క్రెవిస్’, ‘ఓత్ టు యషర్’ వంటి లఘు చిత్రాలతో సహా పలు ప్రాజెక్టులు తెరకెక్కించాడు. బాబక్ 2009 లో టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో సినిమా విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios