Asianet News TeluguAsianet News Telugu

పాక్ పై ఇరాన్ సర్జికల్ స్ట్రైక్.. ఉగ్రవాద శిబిరం నుంచి ఇద్దరు సైనికులకు విముక్తి...

పాకిస్తాన్ పై ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్న కారణంగా పాక్ పై ఇరాన్ మెరుపు దాడుల చేసింది. కొన్ని రోజుల క్రితం భారత్ చేసినట్టుగానే మెరుపుదాడులతో పాక్ పై విరుచుకుపడింది. ఇరాన్ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్ దళం (ఐఆర్ జేసీ) తాజాగా ఈ సర్జికల్ స్ట్రైక్స్  చేసింది. 

iran carries out surgical strike inside pakistan territory, frees two kidnapped - bsb
Author
Hyderabad, First Published Feb 5, 2021, 3:52 PM IST

పాకిస్తాన్ పై ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్న కారణంగా పాక్ పై ఇరాన్ మెరుపు దాడుల చేసింది. కొన్ని రోజుల క్రితం భారత్ చేసినట్టుగానే మెరుపుదాడులతో పాక్ పై విరుచుకుపడింది. ఇరాన్ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్ దళం (ఐఆర్ జేసీ) తాజాగా ఈ సర్జికల్ స్ట్రైక్స్  చేసింది. 

ఇరాన్ సైనికులిద్దరూ కొంతకాలంగా బెలూచిస్తాన్ చెరలో ఉన్నారు. వీరిని విడిపించుకు వెళ్లేందుకే ఇరాన్‌ ఈ మెరుపుదాడి నిర్వహించినట్టు ఐఆర్‌జేసీ వెల్లడించింది. బెలూచిస్తాన్ లోని జైష్ ఉల్ అదల్ అనే ఉగ్రవాద సంస్థ 2018లో 12 మంది ఇరాన్ సైనికులను అపహరించుకువెళ్లింది. 

ఈ ముఠా ఇరాన్ కు వ్యతిరేకంగా సాయుధ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. బెలూచిస్తాన్ లో ఖైదీలుగా ఉన్న  ఇరాన్‌ సైనికులను విడిపించడానికి ఒక కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిటీ మార్గదర్శకాల్లోనే ఈ స్ట్రైక్స్ జరిగాయి. 

తాజాగా ఇరాన్‌ నిర్వహించిన మెరుపుదాడిలో ఈ ఇద్దరు బందీలను ఇరాన్ విడిపించుకు వెళ్లింది. బెలూచిస్తాన్ కు చెందిన జైష్ ఉల్ అదల్ ఉగ్రవాద సంస్థ ఇరాన్ సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిని అపహరించి పాకిస్తాన్‌కు తరలించుకుపోయిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయి. 
 
Follow Us:
Download App:
  • android
  • ios