ఓ కోవిడ్‌ సోకిన వ్యక్తి అధికారులను బురిడీ కొట్టించి విమాన ప్రయాణం చేశాడు. చివరకు తాను చేరుకోవాల్సిన  గమ్యానికి చేరుకున్నాడు. కానీ పోలీసులకు  చిక్కాడు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది.  ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.

జకార్తా : ఇండోనేసియాలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో విమాన ప్రయాణాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఆ ప్రయాణాలు కూడా అనేక ఆంక్షలతో జరుగుతున్నాయి. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే విమాన ప్రయాణానికి అనుమతిస్తున్నారు.

ఈ పరిణామాలతో ఓ కోవిడ్‌ సోకిన వ్యక్తి అధికారులను బురిడీ కొట్టించి విమాన ప్రయాణం చేశాడు. చివరకు తాను చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకున్నాడు. కానీ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.

ఓ కోవిడ్‌ పాజిటివ్ సోకిన వ్యక్తి ఇండోనేషియాలోని జకార్తా నుంచి అదే దేశంలోని మరో పట్టణం టెర్నేట్ కు విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే అతడికి కరోనా సోకింది. ఎలాగైనా విమాన ప్రయాణం చేయాలని తన భార్య పేరు మీద సిటిలింక్‌ విమానంలో టికెట్ బుక్ చేశాడు. ఆ తర్వాత ప్రయాణానికి సిద్ధమయ్యాడు.

బురఖా వేసుకుని ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. తనిఖీల సమయంలో తన భార్య పాస్పోర్ట్ ఇతర పాత్రలు కార్డు లో చూపించడంతో అధికారులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. పైగా, బురఖా వేసుకోవడంతో మహిళగా భావించారు. ఆ తర్వాత ఆయన విమానమెక్కి టెర్నేట్ కు చేరుకున్నాడు. అయితే అతడు చేసిన చిన్న తప్పు పోలీసులు పట్టుకునేలా చేసింది.

భూమికి మరో ముప్పు.. దూసుకొస్తున్న భారీ అస్టరాయిడ్

టేకాఫ్ అయ్యే సమయంలో అతడు బాత్రూం కి వెళ్ళాడు. ఆ సమయంలో అతడు పురుషుల బాత్రూంలోకి వెళ్ళాడు. వచ్చేటప్పుడు బురఖా తీసి బయటికి వచ్చాడు. ఈ విషయం విమాన సిబ్బంది గ్రహించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆయన విమానం దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది.

ప్రస్తుతం ఆయనను క్వారంటైన్ కు తరలించారు. నిబంధనలు ఉల్లంఘించడంతో అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్ వ్యక్తి ప్రయాణించడం తో ఆ విమానంలో ప్రయాణించిన వారంతా ఆందోళన చెందుతున్నారు. వారికి విమాన సిబ్బంది పలు సూచనలు చేసినట్లు సమాచారం.

ఇండోనేషియాలో కరోనా తీవ్రంగా ఉంది. రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఈ విధంగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుండడంతో కేసులు పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.