Asianet News TeluguAsianet News Telugu

ఇండోనేషియాలో సునామీ...62 మంది మృతి

దీవుల సముదాయమైన ఇండోనేషియాను మరోసారి సునామీ అతలాకుతలం చేసింది. శనివారం అర్థరాత్రి సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం సముద్రాన్ని అల్లకల్లోలంగా మార్చి తీర ప్రాంతాలను ముంచెత్తింది. ఈ సునామీ దాటికి దాదాపు 62 మంది మృతిచెందగా, మరో 600 మంది వరకు తీవ్ర గాయాలపాలైనట్లు ఇండోనేషియా విపత్తు నివారణ అధికారులు వెల్లడించారు. 

Indonesia Tsunami Set Off By Volcanic Activity
Author
Indonesia, First Published Dec 23, 2018, 11:05 AM IST

దీవుల సముదాయమైన ఇండోనేషియాను మరోసారి సునామీ అతలాకుతలం చేసింది. శనివారం అర్థరాత్రి సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం సముద్రాన్ని అల్లకల్లోలంగా మార్చి తీర ప్రాంతాలను ముంచెత్తింది. ఈ సునామీ దాటికి దాదాపు 62 మంది మృతిచెందగా, మరో 600 మంది వరకు తీవ్ర గాయాలపాలైనట్లు ఇండోనేషియా విపత్తు నివారణ అధికారులు వెల్లడించారు. 

తరచూ భూకంపాల భారిన పడే  ఇండోనేషియాలో అప్పుడప్పుడు సముద్ర గర్భంలో కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారి రాకాసి అలలతో తీర ప్రాంతాలను ముంచెత్తుతుంది. ఇలా గతంలో కూడా చాలాసార్లు ఇండోనేషియాలో భారీ సునామీలు సంభవించాయి. 

తాజా సునామీ ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్‌, దక్షిణ లాంపంగ్‌ ప్రాంతాలపై తన ప్రతాపాన్ని చూపింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా దీవుల్లో సునామీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. సునామీ కారణంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలుతీర ప్రాంతంలోని వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతీశాయి. 

ఈ అలల దాటికి కొంతమంది సముద్రంలో గల్లంతయ్యారని సహాయక చర్యులు చేపడుతున్న అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య  మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సునామీ దాటికి గురైన ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.  
 
Follow Us:
Download App:
  • android
  • ios