ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సైనికులతో పాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు యత్నిస్తున్నాయి. ఈ దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కర్ణాటకకు చెందిన నవీన్‌గా గుర్తించారు.
ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సైనికులతో పాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు యత్నిస్తున్నాయి. అయితే సైనికులు, ప్రజలు ఈ దాడిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. అయినప్పటికీ రష్యా బలగాలు విడిచిపెట్టడం లేదు. ఈ దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కర్ణాటకకు చెందిన నవీన్‌గా గుర్తించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ శాఖలకు కేంద్రం ఫోన్ చేసి .. తమ విద్యార్ధుల తరలింపునకు సహకరించాల్సిందిగా కోరింది. నవీన్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం హవేరి. ఇతను ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్ మరణం పట్ల విదేశాంగ శాఖ తీవ్ర సంతాపం తెలిపింది.
With profound sorrow we confirm that an Indian student lost his life in shelling in Kharkiv this morning. The Ministry is in touch with his family.
We convey our deepest condolences to the family.Ad2
మృతుడిని కర్ణాటకకు (karnataka) చెందిన నవీన్‌గా (naveen) గుర్తించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ (ministry of external affairs) అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ శాఖలకు కేంద్రం ఫోన్ చేసి .. తమ విద్యార్ధుల తరలింపునకు సహకరించాల్సిందిగా కోరింది. నవీన్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం హవేరి. ఇతను ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్ మరణం పట్ల విదేశాంగ శాఖ తీవ్ర సంతాపం తెలిపింది.
అయితే నవీన్‌ను అసలు రష్యా సేనలు ఎందుకు లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చిందినే దానిపై క్లారిటీ లేదు. కాకపోతే.. మృతుడి సమీప బంధువుకు విదేశాంగశాఖ అధికారులు చెప్పిన దానిని బట్టి.. బంకర్‌లో వుంటున్న నవీన్ మంగళవారం ఉదయం సరుకులు తెచ్చుకోవడానికి దగ్గరలోని స్టోర్‌కు వెళ్లాడు. అక్కడ పనిముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా.. అప్పటికే రష్యా సేనలు నగరంలోకి చొచ్చుకురావడం, ఉక్రెయిన్ సేనలు వారిని ప్రతిఘటిస్తుండటం జరుగుతోంది.
ఇరు పక్షాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్న వార్ జోన్‌లోకి నవీన్ ప్రవేశిం అతనిపై కాల్పులు జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గాయాలతో ఆసుపత్రిలో వున్నాడు.. లేక చనిపోయాడా అని నవీన్ బంధువు ప్రశ్నించగా.. అతను చనిపోయినట్లు 100 శాతం ధ్రువీకరణ అయ్యిందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. మృతదేహాన్ని భారత్‌కు తరలించే విషయమై అడగ్గా.. ప్రస్తుతం ఆ ప్రాంతం వార్ జోన్‌లో వుందని, భౌతికకాయాన్ని మార్చురీలో భద్రపరిచామని.. పరిస్ధితులు చక్కబడిన తర్వాత స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది.
