Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగుల భార్యలకు సాలరీలు, పేరెంట్స్ కు పెన్షన్లు.. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త పెద్ద మనసు..

తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల భార్యలకూ వేతనాలు ప్రకటించి యూఏఈలోని భార‌త సంత‌తికి చెందిన వ్యాపార వేత్త తన ఉదారత చాటుకున్నాడు. అంతేకాదు తన ఈ నిర్ణయం వెనుక ఓ ప్రమాద కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వే తనకు ప్రేరణ అంటూ ప్రకటించి ఆశ్యర్యపరిచాడు. 

indian origin UAE businessman to pay salaries to his employees wives, pentions for parents - bsb
Author
Hyderabad, First Published Feb 4, 2021, 3:16 PM IST

తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల భార్యలకూ వేతనాలు ప్రకటించి యూఏఈలోని భార‌త సంత‌తికి చెందిన వ్యాపార వేత్త తన ఉదారత చాటుకున్నాడు. అంతేకాదు తన ఈ నిర్ణయం వెనుక ఓ ప్రమాద కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వే తనకు ప్రేరణ అంటూ ప్రకటించి ఆశ్యర్యపరిచాడు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇంకెంతోమంది ఉద్యోగుల వేతనాల్లో కోతలతోనే నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో సోహన్ రాయ్ అనే వ్యాపారవేత్త తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ లో ఉండే భార‌త సంత‌తికి చెందిన వ్యాపార వేత్త సోహ‌న్ రాయ్ కరోనా కారణం చెప్పి తన కంపెనీ నుంచి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించలేదు. ఇలాంటి విపత్కర సమయంలో ఉద్యోగం నుండి తొలగిస్తే.. మరో జాబ్ దొరకడం కష్టమే కాకుండా, ఉద్యోగి కుటుంబం వీధిన పడుతుందని మానవత దృక్పథంలో ఆలోచించారు. 

ఇదే క్రమంలో తాజాగా రాయ్ క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసిన ఉద్యోగులతో పాటు వారి భార్యలకు జీతాలు చెల్లించ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఈ నిర్ణయం అందరి ప్రశంసలూ అందుకుంటోంది. కేర‌ళ‌కు చెందిన సోహ‌న్ రాయ్‌.. షార్జా కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వ‌ర్తిస్తున్నారు. యూఏఈ వ్యాప్తంగా ఉన్న ఎరైస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్ర‌మోట‌ర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

కరోనా సంక్షోభం వేళ నిజాయితీగా, నిబద్ధతతో పని చేసిన తన సంస్థలోని ఉద్యోగుల భార్య‌ల‌కు రెగ్యుల‌ర్‌గా వేత‌నాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అక్కడి స్థానిక మీడియా సమాచారం ప్రకారం ప్రస్తుతం రాయ్ కంపెనీ అధికారులు తమ సంస్థలోని పురుష ఉద్యోగుల భార్యలకు సంబంధించిన డేటాను సేకరించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. 

సదరు ఉద్యోగి తమ సంస్థలో ఎన్నేళ్లుగా పనిచేస్తున్నాడో అనే దాని ఆధారంగా వారి భార్యలకు మంత్లీ సాలరీలు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాసెస్ పూర్తైన వెంటనే ఉద్యోగుల భార్యలకు వేతనాలు ఇవ్వడం ప్రారంభిస్తామని తెలిపారు. 

సోహన్ రాయ్ సక్సెస్‌పుల్ బిజినెస్‌మెన్. ఫోర్బ్స్ 2017 లో విడుదల చేసిన మిడిల్ ఈస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ లీడర్ల జాబితాలో చోటు కూడా దక్కించుకున్నారు. తన ఈ నిర్షయం వెనుక భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ప్రేరణ అని చెప్పుకొచ్చారు. 

ఒక ప్రమాద కేసులో సుప్రీంకోర్టు ఒక గృహిణి పని విలువ ఆమె ఉద్యోగం చేసిన భర్త కంటే తక్కువేం కాదని ఇచ్చిన ఉత్తర్వు ప్రకారమే తానీ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అంతేకాదు ఎరైస్ గ్రూపులో మూడేళ్లు పూర్తి చేసిన తన ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ కూడా ఇవ్వనున్నట్లు రాయ్ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios