ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యం. అది కేంద్రప్రభుత్వాలైనా, రాష్ట్రప్రభుత్వాలైనా వాటికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే వాటిల్లో మద్యం కూడా ఒకటి. కొన్ని రకాలైన మద్యంతో పేర్లు పాపులర్ అవుతాయి. మరికొన్ని బ్రాండ్ నేమ్ తో పాపులర్ అవుతుంటాయి. 

అలా పాకిస్తాన్ లో ఇప్పుడు ఓ జిన్ బ్రాండ్ హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ దానికి పెట్టిన పేరేంటీ అంటూ జిన్నా. 
మహ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ పితామహుడు. ఈయన పేరును ఓ జిన్ కు పెట్టారు.  

ఆ జిన్ బాటిల్ ను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  బాటిల్ పేరు కింద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ అని రాసుంది. 1947లో ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయిన తరువాత ఆ దేశంలో మహానేతగా ఎదిగారు.  అక్కడి కరెన్సీ నోట్లపై జిన్నా ఫోటోలు కనిపిస్తాయి.  

అయితే, జిన్నాకు మంచి స్కాచ్, జిన్ అంటే మహా ప్రీతి.  వీటిని అయన ఎప్పుడు ఖండించలేదు అని ఆ జిన్ లేబుల్ పై రాసుంది.  దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  జిన్నాపేరుతో వచ్చిన ఈ పానీయాన్ని జాతీయ పానీయంగా ప్రకటించాలని కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు.