ఆగస్టు 14కు ముందుగానేప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారం...?

First Published 29, Jul 2018, 4:43 PM IST
imran khan to take oath as prime minister before august 14
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. పాక్ ఎన్నికల కమిషన్ వెలువరించిన తుది ఫలితాల్లో తెహ్రీక్ ఎ ఇన్సాఫ్- 115, పాకిస్థాన్ ముస్లిం లీగ్- (నవాజ్)-64, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)-43 స్థానాల్లో గెలుపొందాయి. 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 137కు 22 స్థానాల దూరంలో పీటీఐ నిలిచిపోవడంతో ఆ సంఖ్యను భర్తీ చేయడానికి ఆ పార్టీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. చిన్నా చితకా పార్టీలతో పాటు స్వతంత్రులను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పరచాలని పీటీఐ భావిస్తోంది. అన్ని లాంఛనాలన్నీ పూర్తి చేసి ఆగస్టు 14లోపు ఇమ్రాన్‌ఖాన్ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని.. పీటీఐ నేత నయినల్ హక్ తెలిపారు. 

loader