Imran Khan: తనను గద్దె దింపడానికి ప్రతిపక్షాలు ఏకమయ్యాయని, ప్రతిపక్షాలు తమపై ఎలాంటి ఆరోపణలు చేసినా.. అవిశ్వాస తీర్మానం విజయవంతం కాదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. చివరి అవకాశం వరకూ తాను వేచిచూస్తూనే వుంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
Imran Khan: పాకిస్థాన్ లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. మార్చి 28న ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నది. ఈ సందర్భంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. శుక్రవారం జరగనున్న అవిశ్వాస తీర్మానానికి ముందు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. తనను గద్దె దించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయని, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నానా విధాలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై పెట్టిన అవిశ్వాసంలో ప్రతిపక్షాలు నెగ్గవని ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేశారు. చివరి అవకాశం వరకూ తాను వేచిచూస్తూనే వుంటానని, చివరాఖరుకు తాను ప్రతిపక్షాలకు షాక్ ఇస్తానని ప్రకటించారు.
ప్రతిపక్షాలు తీవ్రమైన ఒత్తిడిలో వున్నాయని, ఏం చేయాలో పాలుపోవడం లేదని విమర్శించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయననీ, చివరి బంతి వరకు ఆడతాననీ, ప్రతిపక్షాలు ఒత్తిడిలో ఉన్నందున.. చివరాఖరుకు వారిని పెద్ద షాక్ ఇస్తానని అన్నారు. తన దగ్గర చాలా వ్యూహాలున్నాయని, ఇప్పటి వరకూ ఏ వ్యూహాన్ని బయటకు తీయలేదని, అదే తన ట్రంప్ కార్డ్ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
తన ప్రభుత్వం కూలిపోతే.. తాను చేతులు ముడుచుకొని కూర్చున్నానని అందరూ అనుకుంటున్నారు. కానీ.. అలా ఏన్నాడు జరగదనీ, తన వద్ద చాలా వ్యూహాలున్నాయని,ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయననీ, అసలు రాజీనామా ఎందుకు చేయాలి? ప్రశ్నించారు. ప్రతి పక్ష దొంగలు పెట్టే ఒత్తిడి వల్ల రాజీనామా చేయాలా?’ అంటూ ప్రధాని ఇమ్రాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఇప్పటి వరకు సైన్యంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, శక్తిమంతమైన సైన్యం పాకిస్థాన్‌కు కీలకమని, సైన్యాన్ని విమర్శించడం సరికాదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. శక్తివంతమైన సైన్యం లేకపోతే.. దేశం మూడు ముక్కలుగా విడిపోయేదని అన్నారు. రాజకీయం చేస్తున్నందుకు సైన్యాన్ని విమర్శించకూడదని ఆయన అన్నారు. ఇమ్రాన్ ఖాన్ కూడా పదే పదే పదే పదే బెదిరింపులకు గురిచేస్తూ పదవి నుంచి దిగిపోతే మౌనంగా ఉండనని ప్రతిపక్షాలను హెచ్చరించాడు.
తన ప్రభుత్వాన్ని గద్దె దించినా... తన సిద్ధాంతాల విషయంలో రాజీపడననీ, ప్రజలకు, దేవుడికి ద్రోహం చేయలేనని అన్నారు. తన పార్టీ -- పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ప్రజాదరణ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నాతో ఉన్నారనీ, 60-65 శాతం మంది ప్రజలు తన పక్షాన నిలబడి ఉన్నారని అన్నారు. నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్ మార్చి 25న అవిశ్వాస తీర్మానం కోసం సమావేశాన్ని పిలిచారు.
