ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం, రాజకీయ నాయకుడు ఇమ్రాన్‌ ఖాన్‌పై అతని మాజీ భార్య, జర్నలిస్ట్‌ రేహమ్‌ ఖాన్‌  సంచలన ఆరోపణ చేసింది. ఇమ్రాన్‌ హోమోసెక్సువల్‌ అని ఆరోపించింది. అతడికి పలువురు పురుషులతో సంబంధాలున్నాయని చెప్పింది. 

అతడు గే.. నన్ను లైంగికంగా వేధించాడని రేహమ్ ఖాన్ వ్యాఖ్యానించింది. నటుడు హమ్జా అలీ అబ్బాసీ, ఇమ్రాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) సభ్యుడు మురాద్‌ సయీద్‌లు ఇమ్రాన్‌కు హోమోసెక్సువల్‌ భాగస్వాములని వెల్లడించింది.
 
ఈ విషయాలను త్వరలో విడుదలకానున్న తన ఆత్మకథలో రాసింది. అయితే మురాద్‌ సయీద్‌ రేహమ్‌ ఆరోపణలను ఖండించారు. రోత మనుషులు చేసిన ఆరోపణలకు తాను స్పందించాల్సిన అవసరంలేదని ఆయన అన్నారు. ఆమె ఎవరి చేతిలో పావుగా మారి ఆ ఆరోపణలు చేస్తున్నదో తనకు తెలుసునని ఆయన అన్నారు. 

తమ వివాహానికి ముందు ఓసారి ఇమ్రాన్‌ తనను లైంగికంగా వేధించాడని పాకిస్థాన్‌ మీడియాకు రేహమ్‌ చెప్పింది. తమ పెళ్లికి ముందు ఇమ్రాన్‌ను రెండోసారి కలిసినప్పుడు అతను లైంగికంగా తనను వేధించాడని, తనకు అలాంటివి నచ్చవంటూ అతణ్ని తోసివేశానని ఆమె ఇమ్రాన్ ఖాన్ పై చెప్పింది. 

అయితే, నీవు అలాంటిదానివి కాదని నాకు తెలుసు.అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని అతను అప్పటికి సర్దిచెప్పాడని రేహమ్‌ చెప్పింది.