ImranKhan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికార పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు ఆయనకు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయన ప్రభుత్వం పీకల్లోతు కష్టల్లో చిక్కుకుంది. ఇప్పటికే ఇమ్రాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు గతవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉండగలరా? అనే దానిపై మరింత అనిశ్చితి ఏర్పడింది.
ImranKhan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఆయన ప్రభుత్వానికి పలువురు ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో మైనారిటీలో పడింది. ఇప్పటికే ఇమ్రాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు గతవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉండగలరా? అనే దానిపై మరింత అనిశ్చితి ఏర్పడింది.
ఇమ్రాన్ ఖాన్ తన సంకీర్ణ భాగస్వాములను కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని, రోజురోజుకు ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులను కోల్పోతున్నారు. గురువారం ముగ్గురు మంత్రులు, 24 మంది ఎంపీలు రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. అలాగే.. ప్రభుత్వ నిర్వహణలోనూ, ఆర్థిక వ్యవస్థను క్రమంగా గాడిలో పెట్టడంలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం విఫలం అయ్యారని విపక్షం ఆరోపిస్తున్నది. ప్రధానంగా.. దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానాన్ని సరిగా నిర్వహించలేదని ప్రతిపక్షం విమర్శలను గుప్పించింది.
అయితే, ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో ఏ ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. వచ్చేవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఈ తీర్మానంతో ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానమంత్రితో తమకు విభేదాలు ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ పార్టీలోని ఎంపీ రాజా రియాజ్ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. 20 మందికి పైగా ఫిరాయింపుదారులు ఉన్నారని, మనస్సాక్షి ప్రకారం ఓటేస్తామని ఆయన అన్నారు. ఇస్లామాబాద్‌లోని ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కార్యాలయంలో పలువురు అధికార పార్టీ సభ్యుల రికార్డ్ చేసిన ఫుటేజీని టీవీ చూపించింది.
ఇమ్రాన్ గట్టెక్కాలంటే..
ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ అవిశ్వాస తీర్మానం నుంచి బయటపడాలంటే.. 172 మంది ఎంపీల మద్దతు అవసరం. మిత్రపక్ష పార్టీలు, అధికార పార్టీలోని అసమ్మతి వాదులు మినహా ఇమ్రాన్‌ఖాన్‌కు దిగువసభలో 155 సభ్యుల మద్దతు ఉన్నట్టు సమాచారం. సమాచారశాఖ మంత్రి ఫవాద్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి బ్లాక్‌మెయిల్ విధానాలు అవలంభించబోమన్నారు. నవాజ్‌షరీఫ్ సారధ్యంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ -నవాజ్ (PML-N), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) లకు కలిపి 163 మంది సభ్యులు ఉన్నారు. దేశంలో శక్తిమంతమైన మిలిటరీతో ఇమ్రాన్‌ఖాన్ సంబంధాలు దెబ్బ తిన్నాయని సమాచారం. కానీ దీన్ని ఇమ్రాన్‌ఖాన్, సైన్యం ఖండించాయి.
