ఇమ్రాన్ ఖాన్ కు 5గురు అక్రమ సంతానం, వారిలో ఇండియన్స్: మాజీ భార్య

Imran Khan has 5 illegitimate children, some Indian: Ex-wife Reham Khan
Highlights

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పాకిస్తాన్ తెహ్రీక్ - ఎ- ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని ఆయన మాజీ భార్య రేహమ్ ఖాన్ ఆరోపించారు. వారిలో భారతీయులు కూడా ఉన్నారని ఆమె చెప్పారు.

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పాకిస్తాన్ తెహ్రీక్ - ఎ- ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని ఆయన మాజీ భార్య రేహమ్ ఖాన్ ఆరోపించారు. వారిలో భారతీయులు కూడా ఉన్నారని ఆమె చెప్పారు. ఈ విషయాలను గురువారం అమెజాన్ కిండ్లే విడుదల చేసిన ఆమె రేహమ్ ఖాన్ అనే పుస్తకంలో వెల్లడించారు. 

పుస్తకం విడుదలకు ముందే ఆమె పతాకశీర్షికలకు ఎక్కారు. ఇమ్రాన్ ఖాన్ పైనే కాకుండా ఇతరులపై కూడా ఆమె తన పుస్తకంలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అందుకు మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తో పాటు మరో ముగ్గురు ఆమెకు లీగల్ నోటీసులు ఇచ్చారు. 

ఈ పరిస్థితిలో తనను చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె ఆరోపించారు. తనను తీవ్రమైన మానసిక వైదనకు గురి చేస్తున్నాయని, అయితే తాను ఆశావాదిని అని, ఆ సంఘటనలు తనను ఏమీ చేయలేవని ఆమె అన్నారు. 

పుస్తకమంతా తన జీవితమేనని, తన పోరాటాలేనని, వాటిని తాను ఎలా అధిగమించాననే విషయాలు రాశానని ఆమె చెప్పారు. తన పుస్తకం చదివిన తర్వాత మహిళలు ఎక్కడో ఓ దగ్గర తమను తాము చూసుకుంటారని ఆమె అన్నారు. 

మరో దిగ్భ్రాంతికరమైన విషయాన్ని ఆమె వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ కు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని ఆమె ఆరోపించారు. ఆ విషయాన్ని ఇమ్రాన్ తనకు స్వయంగా చెప్పారని అంటూ వారిరువురి మధ్య జరిగిన సంభాషణను పుస్తకంలో రాశారు. ఆమె రాసిన విషయం ఇలా ఉంది.

"నీకు తెలుసా, ఆమె ఒక్కతే కాదు" అని చిలిపిగా నవ్వి "మొత్తం ఐదుగురు ఉన్నారు, అది నాకు తెలుసు" అని అన్నారు. 

"ఐదు ఏమిటి?" నేను అడిగాను.

"పిల్లలు" ఆయన నవ్వాడు.

"ఏమిటి? ఐదుగురు అక్రమ సంతానమా! నీకు ఎలా తెలుసు?" నేను అడిగాను.

"వాళ్ల తల్లులే చెప్పారు" ఆయన చెప్పారు. 

"అందరూ తెల్లవాళ్లేనా?"

"కాదు, కొందరు ఇండియన్స్. ఇప్పుడు పెద్ద సంతానానికి 34 ఏళ్లు"

"ఎలా ఇమ్రాన్? తల్లి ఎందుకు బయటకు రావడం లేదు?"

"ఎందుకంటే ఆమె చంద్రుడిపై ఉంది! ఆమె పెళ్లి చేసుకుంది. గర్భం దాల్చలేదు. దాంతో ఆమె సంతోషించింది, దాన్ని రహస్యంగా ఉంచుతానని ప్రామిస్ చేసింది. దాన్ని బయటపెట్టవద్దని వేడుకుంది. నేను సరే అన్నాను"

"మిగతా వాళ్ల సంగతేమిటి? వాళ్లు ఎందుకు ఎప్పుడు కూడా మాట్లాడలేదు?" నేను ఆయనపై అగ్రహించాను. నా తలలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. 

"వాళ్లంతా పెళ్లి చేసుకున్నారు. వాళ్ల వివాహాలు చెడిపోకూడదని అనుకున్నారు" ఆయన చెప్పారు.

"ఇంకా ఎవరికైనా తెలుసా?" అడిగాను

"జమిమాకు మాత్రమే తెలుసు. ఆమెకు నేను చెప్పా" ఆయన సమాధానమిచ్చారు అతి మామూలుగా.

loader