ఇమ్రాన్‌ఖాన్ మరో సంచలన నిర్ణయం.. వీఐపీలకు షాక్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 27, Aug 2018, 6:17 PM IST
Imran Khan Bans VIP Perks at Airports
Highlights

పాలనలో తనదైన ముద్ర వేయడానికి పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వరుసపెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రధాని, అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి ఇలా ఎవరైనా సరే బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణించాలని శాసనం చేసిన ఆయన... తాజాగా వీఐపీలకు రాజభోగాలపై ఫోకస్ చేశారు

పాలనలో తనదైన ముద్ర వేయడానికి పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వరుసపెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రధాని, అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి ఇలా ఎవరైనా సరే బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణించాలని శాసనం చేసిన ఆయన... తాజాగా వీఐపీలకు రాజభోగాలపై ఫోకస్ చేశారు.

రాజకీయ నాయకులు, మిలటరీ అధికారులు, న్యాయమూర్తులు సహా ఉన్నతాధికారులు విమానాశ్రయాలకు వస్తే వీఐపీ ప్రొటోకాల్‌ను పాటించాలి. ఇక మీదట ఇలాంటి ప్రొటోకాల్‌ను పాటించాల్సిన అవసరం లేదని పాక్ హోంమంత్రిత్వ శాఖ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

ప్రజలంతా సమానమేనని.. అన్ని వర్గాల వారిని సమానంగా చూడటానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సమాచార మంత్రి తెలిపినట్లుగా మీడియా తెలిపింది. అయితే వీఐపీ ప్రోటోకాల్‌పై గతంలోనూ నిషేధించినప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు.. కానీ ఈ సారి దీనిని పక్కగా అమలు చేయాలని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. 

loader