భారత ప్రధాని నరంద్రమోదీని... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుసరిస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం విషయంలో... ఇమ్రాన్ ఖాన్... మోదీ ఆలోచనలను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా పన్ను వసూళ్ల ఆదాయంపై ఆయన దృష్టి పెట్టారు.  పన్ను చెల్లించే ప్రతి ఒక్కరికి లబ్ది ఉండే విధంగా ‘లాస్ట్ అసెట్ డిక్లరేషన్’ సరికొత్త పథకంతో ముందుకు వచ్చారు.
 
 ఇదే పథకాన్ని 2016లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చారు. దేశంలో నోట్లరద్దు అనంతరం బినామీ ఆస్తులపై దాడి ప్రారంభించారు. అంతే కాకుండా పన్ను చెల్లించే వారికి కొన్ని రకాల పరిమితులు కల్పిస్తూ సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. దీంతో ఆదాయం పన్ను, ఆస్తి పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగింది. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి.

కాగా.. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే పథకాన్ని అమలుపరుస్తున్నారు. పన్ను చెల్లించేవారికి కొన్ని రకాల పరిమితులను ఇస్తూనే పన్ను వసూళ్లకు మరింత కఠినతరం తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ తాజాగా  స్పష్టం చేశారు. ఈ నెల చివరి నాటికి ప్రతి ఒక్కరు తమ ఆస్తి, ఆదాయ వివరాలను ప్రకటించి, తదననుగుణంగా పన్ను చెల్లించాలని ఇమ్రాన్ సూచించారు. ఈ మేరకు పన్ను చెల్లింపు దారులకు సంబంధిత అధికారులు మెసేజ్ లు కూడా పంపుతున్నారు.