Asianet News TeluguAsianet News Telugu

భారత్‌తో మాకున్న టెన్షన్ అదొక్కటే: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ఊహించని విధంగా కామెంట్ చేశారు. ఇండియాకు సంబందించిన అన్ని విషయాలు మాకు నచ్చినవే అంటూ ఒక్క విషయంలో మాత్రం విభేదించాల్సి వస్తోందని ఆ సమస్య కూడా చర్చలతో పరిష్కరించుకోవచ్చని అన్నారు. 

imran khan about kashmir issue
Author
Hyderabad, First Published Jun 14, 2019, 7:38 AM IST

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ఊహించని విధంగా కామెంట్ చేశారు. ఇండియాకు సంబందించిన అన్ని విషయాలు మాకు నచ్చినవే అంటూ ఒక్క విషయంలో మాత్రం విభేదించాల్సి వస్తోందని ఆ సమస్య కూడా చర్చలతో పరిష్కరించుకోవచ్చని అన్నారు. 

ఇటీవల ఇంటర్నేషనల్ మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ భారత్ - పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడారు. భారత్ తో తాము విభేదించేది ఒక్క కాశ్మీర్ అంశమే అంటూ..అదొక్కటే టెన్షన్ అని చర్చల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. 

ఈ విషయంపై ఎన్నికల కంటే ముందే తాము చర్చలు జరపాలని అనుకున్నప్పటికీ ఆ సమయంలో యుద్ధ వాతావరణం వల్ల పాక్ పై వ్యతిరేక బావాలు నెలకొన్నందున మాట్లాడలేకపోయామని అన్నారు. ఇక మోడీ అత్యధిక మెజారిటీతో గెలిచారు కాబట్టి కాశ్మీర్ విషయంతో పాటు అన్ని విషయాల్లోను శాంతియుతంగా నడుచుకుంటారని భావిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ వివరణ ఇచ్చారు.  

Follow Us:
Download App:
  • android
  • ios