Asianet News TeluguAsianet News Telugu

ఆమె కమ్యూనిస్టు, చాలా డేంజర్.. కమలా హారిస్ పై విరుచుకుపడ్డ ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ పై కమ్యూనిస్టు అని, చాలా భయంకరమైన వ్యక్తి అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవేళ 77 ఏళ్ల జో బైడెన్‌ గనుక అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లయితే, రెండు నెలలు తిరగకుండానే కమల ఆయన నుంచి అధికారాన్ని లాక్కొంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

If Biden wins communist Kamala will takeover in a month, says Trump - bsb
Author
Hyderabad, First Published Oct 9, 2020, 11:02 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ పై కమ్యూనిస్టు అని, చాలా భయంకరమైన వ్యక్తి అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవేళ 77 ఏళ్ల జో బైడెన్‌ గనుక అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లయితే, రెండు నెలలు తిరగకుండానే కమల ఆయన నుంచి అధికారాన్ని లాక్కొంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బుధవారం నాటి వైస్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ సందర్భంగా రిపబ్లికన్‌ మైక్‌ పెన్స్‌, డెమొక్రాట్‌ కమలా హారిస్‌ ల మధ్య అమెరికాపై కోవిడ్‌ ప్రభావం, చైనాతో సంబంధాలు, వాతావరణ మార్పులు, సుప్రీంకోర్టు జడ్జి నియామకం, జాతివివక్ష తదితర అంశాలే ప్రధానంగా చర్చ సాగింది. ఈ క్రమంలో ట్రంప్‌ పాలనపై కమల హారిస్ విమర్శనాస్త్రాలు సంధించారు. గణాంకాలతో సహా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. 

ఈ నేపథ్యంలో గురువారం ట్రంప్ ఫాక్స్‌ న్యూస్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ గత రాత్రి జరిగింది అసలు చర్చలా అనిపించలేదు. ఆమె చాలా టెర్రిబుల్‌. ఇంతకంటే ఘోరంగా ఇంకెవరూ ఉండరు. అసలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆమె ఒక కమ్యూనిస్టు. సెనెటర్‌ బెర్నే సాండర్స్‌కు ఆమె మద్దతుదారు. మనం కమ్యూనిస్టు పాలన చూడాల్సి వస్తుంది. జో ప్రెసిడెంట్‌గా గెలిస్తే తను రెండు నెలల్లోనే అతన్నుండి అధికారం లాక్కుంటుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. 

కరోనా చికిత్స అనంతరం వైట్ హౌజ్ కి చేరుకున్నాక ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో కూడా ట్రంప్‌ ఇలాగే కమలపై విరుచుకుపడ్డారు. ఆమె సోషలిస్టు కాదని, హంతకులు, రేపిస్టులను దేశంలోకి అనమతించేలా సరిహద్దులు తెరుస్తానని చెబుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే జరిగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి, ఆసియా- ఆఫ్రికా మూలాలున్న మహిళగా కమలా హారిస్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అధ్యక్ష అభ్యర్థిత్వానికే పోటీ పడినా, పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో సరిపడా ఓట్లు రాకపోవడంతో కమల బరిలో నుంచి తప్పుకొన్నారు. ఇక ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌ కమలను తన రన్నింగ్‌ మేట్‌గా నామినేట్‌ చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios