Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల భూషణ్ జాదవ్ కేసు విచారణ

గూఢచర్యం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో  కులభూషణ్ జాదవ్ కేసు విచారణ ప్రారంభమైంది. జాదవ్ తరపున ఇండియాకు చెందిన ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తున్నారు.

ICJ starts public hearing in Kulbhushan Jadhav case from Feb 18
Author
Netherlands, First Published Feb 18, 2019, 3:18 PM IST


హేగ్:గూఢచర్యం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో  కులభూషణ్ జాదవ్ కేసు విచారణ ప్రారంభమైంది. జాదవ్ తరపున ఇండియాకు చెందిన ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తున్నారు.

నెదర్లాండ్స్ రాజధాని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషణ్ జాదవ్ కేసు విచారణ సోమవారం నాడు ప్రారంభమైంది. 2016లో గూఢచర్యం కేసులో ఇండియాకు చెందిన కులభూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది.  ఈ కేసులో కులభూషణ్ జాదవ్‌కు పాక్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించింది.

పాక్‌లోని బెలూచిస్తాన్‌లో పాక్ బలగాలను జాదవ్‌ను అరెస్ట్ చేసినట్టుగా అప్పుడు ప్రకటించారు. గూఢచర్యం చేసేందుకే జాదవ్ పాక్‌కు చేరుకొన్నాడని ఆ దేశం ఆరోపించింది.

ఈ ఆరోపణలను ఇండియా కొట్టిపారేసింది. కానీ పాక్ మిలటరీ కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా అంతర్జాతీయ కోర్టును ఇండియా ఆశ్రయించింది. పాక్ మిలటరీ కోర్టు ఇచ్చిన తీర్పుపై  అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది. ఈ తరుణంలో ఈ కేసుపై ఇవాళ వాదనలు ప్రారంభమయ్యాయి.

జాదవ్ తరపున  ప్రముఖ లాయర్ హారీష్ సాల్వే వాదనలను విన్పించారు. జాదవ్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడ పాక్ బయటపెట్టలేదని భారత్ అంతర్జాతీయ కోర్టులో వాదించింది.జాదవ్‌పై పాకిస్తాన్ తప్పుడు కేసును బనాయించిందని  ఆయన ఆరోపణలు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios