Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంక స్వాతంత్య్ర వేడుకల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

శ్రీలంక 70వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నిర్వహించే గగనతల విన్యాసాల్లో భారత వైమానిక దళం సందడి చేయనుంది. మార్చి 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే విన్యాసాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని సూర్యకిరణ్‌, సారంగ్‌, తేజస్‌ విమానాలకు చెందిన బృందాలు పాల్గొననున్నాయి

iafs suryakirans sarang and tejas to take part in srilanka independence day celebrations ksp
Author
Sri Lanka, First Published Feb 28, 2021, 3:29 PM IST

శ్రీలంక 70వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నిర్వహించే గగనతల విన్యాసాల్లో భారత వైమానిక దళం సందడి చేయనుంది. మార్చి 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే విన్యాసాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని సూర్యకిరణ్‌, సారంగ్‌, తేజస్‌ విమానాలకు చెందిన బృందాలు పాల్గొననున్నాయి.

ఆయా విమానాలు ఇప్పటికే శ్రీలంకను చేరుకున్నాయి. సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం 2001లో జరిగిన శ్రీలంక 50వ స్వాతంత్ర్య వేడుకల్లో పాలుపంచుకున్న విషయం తెలిసిందే.

శ్రీలంక వైమానిక దళం, తాము కలిసి శిక్షణ, నిర్వహణ పరమైన మార్పులు, సైనిక విద్య వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడం సహా పలు చర్చలు జరుపుతున్నట్లు భారత వైమానిక దళం తెలిపింది.

తమ 70వ స్వాతంత్ర్య వేడుకల్లో భారత వైమానిక దళం పాల్గొననుండటం ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది.  

Follow Us:
Download App:
  • android
  • ios