Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఇల్యుషిన్-76 హెవీ-లిఫ్ట్ (IL-76 aircraft) విమానాన్ని రంగంలోకి దించారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు రోజురోజుకు తీవ్రమతున్న వేళ.. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఉక్రెయిన్ నుంచి హంగేరీ, పొలాండ్, రొమేనియా దేశాలకు చేరుకుంటున్న భారతీయులను ఇప్పటికే ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తుండగా.. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం.. ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగింది.
ఇప్పటికే C-17 గ్లోబ్‌మాస్టర్ రంగంలోకి దిగింది. రొమేనియాను భారతీయులను క్షేమంగా తీసుకవచ్చింది. ఈ తరుణంలో ఉక్రెయిన్ నుండి చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడాన్ని మరింత వేగవంతం చేయడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) తన అమ్ములపొదిలో ఉన్న.. యుద్ద విమానం
ఇల్యుషిన్-76 హెవీ-లిఫ్ట్ (IL-76 aircraft) విమానాన్ని రంగంలోకి దించింది. ఈ రవాణా విమానాన్ని రష్యాకు మోహరిస్తోంది.
ప్రభుత్వ వర్గాల ప్రకారం.. వైమానిక దళం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. C-17 విమానాలను కాకుండా.. రష్యా సరిహద్దు దేశాల్లో ఉన్న భారతీయులను తరలించడానికి ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా రష్యా-మూలం Ilyushin-76ని మోహరిస్తుంది.Il-76 త్వరలో టేకాఫ్ కోసం క్లియరెన్స్ పొందే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి భారత వైమానిక దళం రష్యాకు చెందిన ఇల్యుషిన్-76 హెవీ-లిఫ్ట్ రవాణా విమానాన్ని రష్యాకు మోహరించింది. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ గంగా మిషన్ కోసం C-17 విమానాలను మోహరించడం లేదని ప్రభుత్వ ఉన్నత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఉక్రెయిన్ నుండి అనేక మంది భారతీయ విద్యార్థులు రష్యా భూభాగంలోకి వెళ్తున్నారని, వారిని తీసుక రావడానికి Ilyushin-76ని మోహరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని ప్రారంభించగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడం కోసం కేంద్రం ‘ఆపరేషన్ గంగ’ మిషన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పోలాండ్, రొమేనియా, హంగేరి నుండి భారతీయ పౌరులను తరలించడానికి C-17లు , వాణిజ్య విమానాలను మాత్రమే మోహరించారు. ఇప్పటి వరకూ ఆపరేషన్ గంగా కింద మొత్తం 30 విమానాల్లో ఉక్రెయిన్ నుండి 6,400 మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇదిలావుండగా.. మొత్తం 18,000 మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దు దాటారని MEA అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం తెలిపారు.
