నాకు మొగుడు వద్దు.. కుక్కలు చాలు అని.. కట్టుకున్న భర్తేని ఓ మహిళ ఇంట్లో నుంచి గెంటేసింది. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్ లోని బ్రన్హమ్ కి చెందిన లిజ్ అనే మహిళకు కుక్కలంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆమె కక్కలను పెంచుకునేది. వాటిని ప్రేమగా చూసుకునేది.

కాగా.. ఆమె తన 16ఏళ్ల వయసులో మైక్ హస్లమ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి పెళ్లి జరిగి ఇప్పటికి సరిగ్గా 25ఏళ్లు అవుతోంది. వీరికి 22ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. లిజ్ కి తనకున్న కుక్కల పిచ్చితో ఇప్పటి వరకు 30 కుక్కలను పెంచి పోషిస్తోంది. రోజంతా వాటితోనే గడపడం చేసేది.

ఈ తీరుతో విసిగిపోయిన భర్త మైక్.. నీకు ఆ కుక్కలు కావాలా..? నేను కావాలో తేల్చుకో అని చెప్పాడు. వెంటనే ఆమె దానికి సమాధానంగా తనకు కుక్కలు కావాలని.. భర్త అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో.. మైక్ ఇళ్లు వదిలి బయటకు వచ్చేశాడు. అయితే, మైక్ ఇల్లు వదిలి వెళ్లడంపై లిజ్ పెద్దగా బాధపడలేదు. పైగా, అతను తనని అర్థం చేసుకోలేకపోయాడంటూ వాపోయింది.

 ‘‘మైక్ ఎప్పుడూ ఆఫీసులో బిజీగా ఉండేవాడు. నాకు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండటం ఇష్టం లేదు. దీంతో కుక్కులను తెచ్చుకున్నా. కానీ, మైక్‌కు అది ఇష్టం ఉండేది కాదు. జీవితంలో చేయాలనుకుంటే చాలా ఉన్నాయని, కుక్కలనే పెంచుకోవక్కర్లేదని అనేవాడు. పెళ్లికి ముందు నుంచి నా గురించి, నాకు అలవాట్లు, ఇష్టాయిష్టాల గురించి మైక్‌కు తెలుసు. కుక్కలతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. అవి కూడా నన్ను అమ్మలా భావిస్తాయి’’ అని లిజ్ తెలిపింది.