దుబాయ్:  భార్య తప్పుడు పనులు చేస్తోందని ఆరోపిస్తూ ఆమె నగ్న చిత్రాలను తీసి సోషల్ మీడియా ద్వారా భార్య కుటుంబ సభ్యులకు పంపాడు ఓ భర్త.  ఈ ఘటన యూఏఈలో చోటు చేసుకొంది.

తన భార్య అశ్లీల పనులు చేస్తోందని  అనుమానంతో ఓ భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆసియా ఖండానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి యూఏఈలో ఉంటున్నాడు.

అయితే తన భార్య తప్పుడు పనులు చేస్తోందని  అనుమానంతో  ఆమె నగ్న ఫోటోలను ఫేస్‌బుక్ మేసేంజర్ ద్వారా  భార్య కుటుంబసభ్యులకు పంపాడు.భార్య సోదరుడు,తండ్రి, తల్లికి మేసేంజర్ ద్వారా ఈ చిత్రాలను షేర్ చేశాడు. ఈ ఫోటోల విషయం తెలుసుకొన్న భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై భర్తపై ఆమె కేసు పెట్టింది. ఈ విషయమై నిందితుడికి రూ.50 లక్షల జరిమానాను విధించింది కోర్టు. మరోవైపు నగ్న చిత్రాలను షేర్ చేసిన సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఫోన్‌ను డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.