ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. పట్టుతప్పి క్షణాల్లో! (వీడియో)

Husband and Wife Trapeze Stunt Gone Wrong
Highlights

రియాల్టీ షోలో ఊహించని ఘటన ఎదురైంది. ఫీట్‌ చేస్తున్న జంటలో పట్టుతప్పి మహిళ కిందపడిపోగా.. రక్షణ చర్యలు ఉండటంతో ఆమె సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. 

రియాల్టీ షోలో ఊహించని ఘటన ఎదురైంది. ఫీట్‌ చేస్తున్న జంటలో పట్టుతప్పి మహిళ కిందపడిపోగా.. రక్షణ చర్యలు ఉండటంతో ఆమె సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. 

అమెరికాస్‌ గాట్‌ ట్యాలెంట్’‌ మంగళవారం ఎడిషన్‌లో టైసీ నీల్సన్‌, మేరీ వోల్ఫీ నీల్సన్‌ దంపతులు ట్రపెజె విన్యాసాలు చేశారు. ట్రపెజె అంటే తాళ్లతో వేలాడదీసిన ఓ కర్రపై విన్యాసాలు చేయడం. వీరి విన్యాసాలు చూసి అక్కడున్న న్యాయ నిర్ణేతలు, ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. అంతా బాగానే ఉంది అనుకునేలోపు వోల్ఫీ పట్టుతప్పి కిందపడిపోయింది. విన్యాసంలో భాగంగా టైసీ.. వోల్ఫీ నీల్సన్‌ను కిందకు జారవిడిచి ఆమె చేతులు పట్టుకోవాలి. అయితే ఆ సమయంలో టైసీ పట్టు కోల్పోవడంతో వోల్ఫీ కిందపడిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆమెకు ఏమైందోనని గట్టిగా అరిచారు. అదృష్టమేంటంటే.. కింద మెత్తని పరుపు ఉండటంతో వోల్ఫీకి ఎలాంటి గాయాలు కాలేదు.

ఫీట్‌చేస్తున్న సమయంలో జడ్జిల హవభావాలు, ప్రేక్షకులు గోల.. ఆ జంట రెండేళ్ల కొడుకు, అతని నానమ్మ చూస్తూ దిగ్భ్రాంతికి గురికావటం.. మొత్తానికి ఆ కట్‌తో ఎపిసోడ్‌పై ఆత్రుత పెంచేసిన AGT నిర్వాహకులు.. ఎపిసోడ్‌ వ్యూవర్‌షిప్‌ మాత్రం విపరీతంగా రాబట్టడంలో సక్సెస్‌ అయ్యారు. 

                                  

loader