ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను నిరసిస్తూ రష్యాలో పలు చోట్ల నిరసనలు సాగుతున్నాయి.  నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.  

మాస్కో: Ukraine పై మిలటరీ ఆపరేషన్ ను నిరసిస్తూ Russia లో పలు నగరాల్లో ఆందోళనకారులు Protestలు నిర్వహించారు. దీంతో రష్యా Police ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పలు పట్టణాల్లో సుమారు వందల మందినిపైగా అరెస్ట్ చేశామని రష్యా పోలీసులు ప్రకటించారు.

గురువారం నాడు తెల్లవారుజాము నుండి ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభిస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ Putin ప్రకటించారు. అయితే ఈ విషయమై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. యుద్దానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాలని రష్యన్ ప్రకజలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు Zelenskyy పిలుపునిచ్చారు రష్యన్ భాషలోనే జెలెన్ స్కీ గురువారం నాడు వీడియో సందేశంలో ఈ విషయాన్ని చెప్పారు.

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను నిరసిస్తూ సెంట్రల్ Moscow లోని పుష్కిన్ స్క్వేర్ సమీపంలో సుమారు 2 వేల మంది ప్రజలు నిరసకు దిగారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ లో సుమారు వెయ్యి మంది ఆందోళన చేశారని స్థానిక మీడియా ప్రకటించింది. రష్యాలోని 54 నగరాల్లో 1745 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాస్కోలోనే సుమారు 957 మందిని అరెస్ట్ చేశారని మీడియా రిపోర్టు చేసింది. 

రష్యాలో విపక్ష నేతలు చాలా మంది Jailలో ఉన్నారు. కొందరు హత్యకు గురయ్యారు. మరికొందరు దేశం నుండి బలవంతంగా బయటకు పంపారు. రష్యాలో విపక్ష నేత అలెక్సీ నవల్నీ మాస్కో వెలుపల రెండున్నర ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ దాడి ప్రారంభించిన తర్వాత అనేక మంది రష్యన్లు వీధుల్లోకి రావాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. మాస్కోలోని పుష్కిన్ స్క్వేర్ వద్ద యుద్ధం వద్దంటూ ప్ల కార్డులు చేతబూని నిరసనకు దిగారు.

ఉక్రెయిన్ లో తమ బంధువులున్నారని మాస్కో కు చెందిన అనస్థిసియా నెస్తుల్య చెప్పారు.1979లో ఆఫ్ఘనిస్తాన్ పై సోవియట్ యూనియన్ దండయాత్ర తర్వాత ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ సోషల్ మీడియాలో వందలాది మంది పోస్టులు పెడుతున్నారు. ఉక్రెయిన్ పౌరులను మారణ హోమం నుండి రక్షించాలని కోరుతున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో కూడా శుక్రవారం నాడు తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున రష్యా పేలుళ్లకు దిగింది.

ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది Lev Ponomavyov ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ కు వ్యతిరేకంగా సంతకాల సేకరణను ప్రారంభించారు. అయితే కొన్ని గంటల్లోనే 1.50 లక్షల మంది సంతకాలు చేశారు. అంతేకాదు 250 మంది జర్నలిస్టులు కూడా రష్యా తీరును నిరసిస్తూ సంతకం చేశారు. మరో వైపు 250 మంది శాస్త్రవేత్తలు కూడా సంతకాలు చేశారు. మాస్కో తో పాటు ఇతర నగరాల్లోని మున్సిఫల్ కౌన్సిల్ సభ్యులు కూడా సంతకాలు చేశారు.

శుక్రవారం నాడు తెల్లవారుజామున Kyiv లో వరుస పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవతా థృక్పథంతో 20 మిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది. UNOసెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ ఈ విషయాన్ని గురువారం నాడు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ నుండి రూ. 20 మిలియన్ డార్లను తూర్పు లుహాన్స్క్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని అవసరమైన కార్యకలాపాలకు వినియోగిస్తామని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.