అమెరికా ఎయిర్‌బేస్‌‌పై పడిన గుర్తు తెలియని వస్తువు.. ఏలియన్స్ నౌకా..? ఉల్కా..?

Huge meteor hits near American Air Force Base at Greenland
Highlights

అమెరికా గ్రీన్‌ల్యాండ్స్‌ సమీపంలోని తులే ఎయిర్‌బేస్‌ సమీయంలో గుర్తు తెలియని వస్తువు ఒకటి పడింది. సెకనుకు దాదాపు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన  ఈ వస్తువు భూమిని తాకడంతో 2.1 కిలోటన్నుల శక్తి వెలువడింది

అమెరికా గ్రీన్‌ల్యాండ్స్‌ సమీపంలోని తులే ఎయిర్‌బేస్‌ సమీయంలో గుర్తు తెలియని వస్తువు ఒకటి పడింది. సెకనుకు దాదాపు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన  ఈ వస్తువు భూమిని తాకడంతో 2.1 కిలోటన్నుల శక్తి వెలువడింది. తమ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఏ దేశంలో అయినా చీమ చిటుక్కుమన్నా హెచ్చరించే అమెరికా రాడార్ వ్యవస్థకు కూడా ఇది అందలేదు.

ఇంత జరుగుతున్నా అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తున్నా.. యూఎస్ ఎయిర్‌‌ఫోర్స్ స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇక్కడ పడింది కేవలం ఉల్కేనా..? లేదా ఏలియన్స్ సంబంధించిన మరేదైనా వస్తువా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అంతరిక్షానికి అమెరికా బాగా దగ్గరవుతోందని.. గ్రహాంతరవాసులకి సంకేతాలు పంపుతోందని ప్రపంచం ఆ దేశంపై సందేహం వ్యక్తం చేస్తోంది.

దీనికి ఏరియా-51ను వారు ఉదాహరణగా చెబుతారు విశ్లేషకులు.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఈ ఏరియాలో అమెరికా గ్రహాంతర వాసులపై ప్రయోగాలు చేస్తోందని ఎప్పటి  నుంచో వినపడుతున్న వాదన.

loader