అమెరికా ఎంబసీ వద్ద భారీ పేలుడు (వీడియో)

huge blast at US embassy in Beijing
Highlights

చైనా రాజధాని బీజింగ్ లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. చైనా కే చెందిన ఓ యువకుడు ఈ  పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ పేలుళ్లకు పాల్పడిన యువకుడికి తప్ప ఇంకెవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. 

అమెరికా ఎంబసీ వద్దకు పేలుడు పదార్థాలతో ప్రవేశించిన 26 ఏళ్ల జియాంగ్ అనే యువకుడు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఇతడు ఇన్నర్ మంగోలియా ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అమెరికా వీసాల కోసం జరిగే కార్యాలయ ప్రవేశంలో ఇతడు పేలుళ్లకు పాల్పడ్డాడు. అయితే ఈ ప్రమాదంలో ఎంబసీ సిబ్బందికి గాని, వీసాల కోసం వచ్చివన వారికి గానీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.  ఈ పేలుడుకు కారనమైన జియాంగ్ చేతికి మాత్రం తీవ్ర గాయమైంది. 

ఇవాళ ఒంటిగంట సమయంలో ఈ పేలుడు సంభవించింది. దీనికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుడు నేపథ్యంలో  ఎంబసీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు.

వీడియో

loader