Asianet News TeluguAsianet News Telugu

30 ఏళ్ల తర్వాత హంతకుడిని పట్టించిన 'కండోమ్'


న్యూయార్క్:కండోమ్ సహాయంతో  30 ఏళ్ల క్రితం 8 ఏళ్ల చిన్నారిపై  అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు  అరెస్ట్ చేశారు. ఆ చిన్నారిపై అత్యాచారం చేసి  హత్య  చేసిన  నిందితుడు పోలీసులకు సవాల్ విసిరాడు

How DNA in condoms helped US police nab killer 30 years after a child’s murder


న్యూయార్క్:కండోమ్ సహాయంతో  30 ఏళ్ల క్రితం 8 ఏళ్ల చిన్నారిపై  అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు  అరెస్ట్ చేశారు. ఆ చిన్నారిపై అత్యాచారం చేసి  హత్య  చేసిన  నిందితుడు పోలీసులకు సవాల్ విసిరాడు.  అయితే 30 ఏళ్ల తర్వాత నిందితుడు ఉపయోగించిన కండోమ్ ద్వారా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకొంది.

అమెరికాలోని ఇండియానా రాష్ట్రం ఫోర్ట్‌వైనే నగరంలో  1988 ఏప్రిల్ 1 వ తేదీన  8 ఏళ్ల చిన్నారి ఏప్రిల్ టిన్‌స్లే అదృశ్యమైంది.  ఆ చిన్నారి అదృశ్యమైన ప్రాంతానికి 32 కిలోమీటర్ల దూరంలో  బాలిక మృతదేహం దొరికింది. 

బాలికపై  నిందితులు అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అంతేకాదు ఆ చిన్నారి మృతదేహన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. అయితే  చిన్నారిని హత్య చేసిన నిందితుడు మాత్రం పోలీసులకు దొరకలేదు.  

ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకొన్నారు. అయితే ఈ కేసు విచారణ సాగుతున్న సమయంలోనే  నగరంలోని ఓ గోడపై  చిన్నారిని మరోసారి చంపుతా... ఆమె మరో షూ నా వద్దే ఉందంటూ ,నిందితుడు రాశాడు.30 ఏళ్లుగా ఈ కేసు విచారణ సాగుతోంది.

అయితే ఈ కేసు దర్యాప్తు సమయంలో అన్ని రకాల కోణాల్లో పోలీసులు దర్యాప్తును సాగించారు. అయితే చివరకు  జన్యు శాస్త్రవేత్తల సహాయాన్ని తీసుకొన్నారు.  జన్యు శాస్త్రవేత్తల సహాయం తీసుకొన్న సమయంలో ఇద్దరు అనుమానితులపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.

గ్రాబిల్‌కు చెందిన  జాన్ మిల్లర్, అతని సోదరులపై పోలీసులు నిఘాను ఉధృతం చేశారు.  ఈ నెల మొదటి వారంలో  జాన్ మిల్లర్ ఇంటి డస్ట్ బిన్ నుండి  కండో‌మ్‌లను సేకరించారు. ఈ కండో‌మ్‌లను పరీక్షించారు. 30 ఏళ్ల క్రితం బాలికపై అత్యాచారం సందర్భంగా నిందితుడి వీర్యంతో ఈ కండోమ్‌లోని వీర్యం కూడ సరిపోయింది. 

ఈ ఆధారంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు.  అయితే ఆ సమయంలో నిందితుడు పోలీసులను చూసి  30 ఏళ్ల క్రితం చిన్నారిని హత్య చేసింది తానేనని ఒప్పుకొన్నాడు.  నిందితుడు మిల్లర్ ....అలెన్ కౌంటీ జైలులో ఉన్నాడు.  వచ్చే వారం ఈ కేసు విచారణ సాగనుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios