న్యూజిలాండ్ లోని సౌత్ ఐలాండ్ లోని టూరిస్ట్ ప్రాంతంగా పేరు పొందిన క్వీన్స్ టౌన్ లోని మోర్వెన్ ఫెర్నీ రోడ్డులో ఉన్న ఒక ఇంటి మీద హాట్ ఎయిర్ బెలూన్ కుప్పకూలిపోయింది. 

ఆకాశంలో ఎగురుతున్న ఓ హాట్ ఎయిర్ బెలూన్ ఆకస్మాత్తుగా ఇంటిమీద కుప్పకూలిపోవడంతో 11 మంది తీవ్రంగా గాయపడిన దుర్ఘటన న్యూజిల్యాండ్ లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 

న్యూజిలాండ్ లోని సౌత్ ఐలాండ్ లోని టూరిస్ట్ ప్రాంతంగా పేరు పొందిన క్వీన్స్ టౌన్ లోని మోర్వెన్ ఫెర్నీ రోడ్డులో ఉన్న ఒక ఇంటి మీద హాట్ ఎయిర్ బెలూన్ కుప్పకూలిపోయింది. 

ఈ ఘటన 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్ తో ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ దుర్ఘటన మీద న్యూజిలాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.